Sharmila Demands: ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చండి చంద్రబాబూ : షర్మిల సవాల్
ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబును ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ని ఒకలా YSR ని ఒకలా చూడొద్దు అంటున్న ఏపీ పీసీసీ చీఫ్

మహానాడు జరుగుతున్న సమయంలోనే వైయస్సార్ జిల్లా పేరును మార్చింది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో ఉన్నట్టే " వైయస్సార్ కడప జిల్లా " పేరును తిరిగి తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. దీనిపై పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి స్పందిస్తూ ఈ నిర్ణయం వ్యక్తిగతం గా తనను బాధిస్తున్నా కడప జిల్లా చరిత్రను అక్కడి ప్రజలు సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ పేరు మార్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా మారుస్తూ "ఎన్టీఆర్ విజయవాడ" జిల్లాగా కొత్త పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
YSR పేరు పలకాల్సి వస్తుందనే జిల్లా పేరు మార్చేశారు: షర్మిల ఆరోపణ
టిడిపి పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి. కడప నగరంలో మహానాడు జరుగుతోంది. అక్కడ ప్రసంగాల మధ్యలో కడప జిల్లా పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి "YSR జిల్లా " పేరు పలకడం ఇష్టం లేక వైయస్సార్ కడప జిల్లా గా పేరు మార్చేసారని షర్మిల ఆరోపించారు. వైయస్సార్ మరణాంతరం కడప జిల్లాకు "YSR కడప " అని పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె గుర్తు చేశారు. సెంటిమెంట్లను గౌరవిస్తూ కడప జిల్లా పేరు మార్చామని చెబుతున్న కూటమి కి నిజం గా ఆ సదుద్దేశమే ఉంటే విజయవాడ ప్రజల సెంటిమెంటు కూడా గౌరవిస్తూ ఎన్టీఆర్ జిల్లా కు " %ఎన్టీఆర్ విజయవాడ " అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు వాళ్లకు పేరు తెచ్చిన ఇద్దరు నేతలను ఒకరిని ఒకలా మరొకరిని ఇంకొకలా వేరు చేసి చూడకూడదని షర్మిల అన్నారు
YSR కడప జిల్లా పేరు మార్చిన జగన్ ప్రభుత్వం
YS రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కడప జిల్లా పేరుకు ఆయన పేరు జోడిస్తూ "YSR కడప జిల్లా" అని కొత్త పేరు పెట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజీకరణ చేపట్టారు. ఆ సమయంలోనే పేరులోని కడపను తొలగిస్తూ " వైఎస్ఆర్ జిల్లా" గా మార్చారు. మహానాడు జరుగుతున్న సమయం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం YSR జిల్లా పేరుకు కడప ను జోడిస్తూ " YSR కడప జిల్లా " అని పేరు మారుస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేసింది.





















