అన్వేషించండి

Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

Sai Krishna Missing Case: విజయవాడలో కలకలం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు అధికారులు వేగం పెంచారు. కృష్ణలంక స్టేషన్‌లోని డిజిటల్ సాక్ష్యాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాయికృష్ణ కస్టడీలో మరణించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణలతో దర్యాప్తు.
  • కృష్ణలంక స్టేషన్‌లో డీవీఆర్‌, సీసీటీవీ దృశ్యాలు ఫోరెన్సిక్‌కు పంపారు.
  • మార్కాపురం నుండి తీసుకువచ్చిన తీరు, లాకప్ వివరాలపై విచారణ.
  • తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ కేసు విచారణాధికారిగా నియమితులయ్యారు.

Sai Krishna Missing Case:విజయవాడ నగరంలో సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, పోలీసులు కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయడా? లేదా ఎవరైనా మాయం చేశారా? ఈ ప్రశ్నల చుట్టూ తిరుగుతున్న మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని స్పెషల్ టీమ్‌ రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయమే కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకున్న అధికారులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 

ఒకవైపు కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ మధ్య ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి స్టేషన్‌లో జరిగిన పరిణామాల వరకు ప్రతి అంశాన్ని దర్యాప్తు బృందం భూతద్దంతో వెతుకుతోంది. ముఖ్యంగా పోలీసులపైనే ఆరోపణలు వస్తుండటంతో సాక్ష్యాల సేకరణలో అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. 

కుటుంబ సభ్యుల సంచలన స్టేట్మెంట్‌లు

శుక్రవారం ఉదయం ఏసీబీ దైవప్రసాద్‌ బృందం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లింది. అక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గలను సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్‌లు రికార్డ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు విచరణాధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్‌  లాకప్‌లో ఉంచారని, అక్కడ సీఐ నాగరాజు అతడిని అమానుషంగా చిత్ర వధ చేసి చంపేశారని వారు ఆరోపించారు. 

హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్ పరికరాలు సీజ్ 

కుటుంబ సభ్యుల స్టేట్మెంట్‌ల అనంతరం దర్యాప్తు టీం కృష్ణ లంక స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కేవలం మాటలతో కాకుండా డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా నిజానిజాలు తేల్చాలని నిర్ణయించింది. స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలు అత్యంత కీలకం కావడంతో అప్పటికప్పుడు ఫోరెన్సిక్‌ అండ్ సైబర్‌ అనాలసిస్‌ టీమ్‌ పిలపించారు. వీటిన్నింటినీ అధికారులు సీజ్ చేసి, విశ్లేషణ కోసం నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ రాత్రి స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ డిజిటల్‌ ఆధారాలే ఇప్పుడు కీలకంకానున్నాయి. 

మార్కాపురం టు విజయవాడ మధ్యలో ఏం జరిగింది?

సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ఆపరేషన్‌లో ఎవరెవరు పాల్గొన్నవారు? అనే కోణంలో విచారణ సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారితోపాటు మరో ఎనిమిది మంది సిబ్బందిని శుక్రవారం దర్యాప్తు టీం విచారించింది. పెండింగ్‌లో ఉన్న NBW అమలు చేసేందుకే సాయికృష్ణ కోసం నలుగురు సిబ్బందిని మార్కాపురం పంపినట్టు ఏడీసీపీ వివరించినట్టు సమాచారం. అయితే అతడి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు.?లాకప్‌లో ఉంచిన సమయం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు వారి స్టేట్మెంట్‌లు రికార్డు చేశారు. 

రంగంలోకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

కేసు తీవ్రతను దృష్ట్యా, ఈ అదృశ్యం వ్యవహారంపై విచారణాధికారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ను నియమించారు. ఆయన శుక్రవారం విజయవాడకు చేరుకుని, తొలుత డీజీపీని కలిసి కేసు పురోగతిని వివరించారు. అనంతరం విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరుగా కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు బృందం ఎనిమిది మంది కీలక సిబ్బందిని విచారిస్తోంది. ఇందులో టాస్క్‌ఫోర్స్,  కృష్ణలంక స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు.

Frequently Asked Questions

సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన మిస్టరీ ఏమిటి?

సాయికృష్ణ పోలీసులు కస్టడీలో మరణించాడా లేక ఎవరైనా మాయం చేశారా అనే మిస్టరీ విజయవాడలో పెను సంచలనంగా మారింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం దీనిపై దర్యాప్తు చేస్తోంది.

సాయికృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులపై చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

మార్కాపురం నుండి తీసుకొచ్చిన సాయికృష్ణను కృష్ణలంక స్టేషన్ లాకప్‌లో సీఐ నాగరాజు చిత్రవధ చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి స్టేట్‌మెంట్‌లను అధికారులు రికార్డ్ చేశారు.

సాయికృష్ణ కేసు దర్యాప్తులో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, కృష్ణలంక పోలీసులతో సహా ఎనిమిది మందిని విచారిస్తున్నారు.

సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?

కేసు తీవ్రతను దృష్ట్యా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఈ అదృశ్యం వ్యవహారంపై విచారణాధికారిగా నియమించబడ్డారు. ఆయన విజయవాడకు చేరుకుని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget