Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని, 4 గంటలు రక్తపుమడుగులోనే
విద్యార్థిని భవనం నుంచి దూకి నాలుగు గంటలు గడిచినా ఎవరూ గమనించలేదు. పై నుంచి పడడంతో విద్యార్థిని కనీసం కదల్లేని స్థితిలో అక్కడే పడి ఉంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆమెను గమనించలేదు.
Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్ భవనంపై నుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ భవనం మూడు అంతస్తులు ఉండగా పైకి ఎక్కి యువతి కిందికి దూకింది. దీంతో తీవ్రగాయాలతో నాలుగు గంటలు రోడ్డుపైనే పడి ఉంది. అయితే విద్యార్థిని భవనం నుంచి దూకి నాలుగు గంటలు గడిచినా ఎవరూ గమనించలేదు. పై నుంచి పడడంతో విద్యార్థిని కనీసం కదల్లేని స్థితిలో అక్కడే పడి ఉంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆమెను గమనించలేదు.
చాలా సేపటి తర్వాత గమనించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చేతిపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడకు తరలించారు. హారికకు వెన్నెముక, కాళ్ళు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు.