Vijayawada Police: ఫ్రెండ్ కోసం వెళ్లిన బాలిక పట్ల ఆటో డ్రైవర్ ఓవర్ యాక్షన్- ఊచలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు
బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌పై కిడ్నాప్, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. చాలా రోజుల నుంచి చాటింగ్ నడిచింది. చివరకు ఓ రోజు కలుద్దామని అనుకున్నారు. అలా వచ్చిన వాళ్లకు ఊహించిన షాక్‌లు తగిలాయి. ఫేస్‌బుక్ ఫ్రెండ్ కలవకపోగా... సమస్యల్లో ఇరుక్కుంది. పోలీసుల జోక్యంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది.
నూజివీడుకు చెందిన ఓ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహితులంతా కలిసి ఆ వ్యక్తితో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. చివరకు కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు. విజయవాడలో కలవాలని అనుకున్నారంత.
స్నేహితుడి కోసం విజయవాడ వచ్చిన ఆమె... అతడిని కలిసింది. కాసేపు మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారాంతా. అతనిపై ఇష్టంతో నూజివీడు వెళ్లాల్సిన ఆ బాలిక తిరిగి మళ్లీ విజయవాడ వచ్చేసింది. తన ఫ్రెండ్ కోసం చాలా ప్రాంతాల్లో వెతికింది.
బస్టాండ్‌లో ఆటో ఎక్కి బెంజ్ సర్కిల్‌లోని లాడ్జ్‌లన్నింటిలో వెతికింది. ఎక్కడా ఆ వ్యక్తి జాడ కనిపించలేదు. ఆమెను అన్ని చోట్ల తిప్పిన ఆటో డ్రైవర్ ఇదంతా గమనించాడు. విషయంపై ఆరా తీశాడు.
బాయ్‌ఫ్రెండ్ కోసం వెతుకుతుందని గ్రహించిన కన్నింగ్ మాటలతో కన్వీన్సింగ్‌గా మాట్లాడాడు. ఓదారుస్తున్నట్టు కటింగ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. బాలిక ఆందోళనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రై చేశాడు. తన ఇంటికి తీసుకెళ్తానని మాయమాటలు చెప్పాడు.
ఆటో డ్రైవర్ మాటలు పూర్తిగా నమ్మేసిందా బాలిక. ఆటో డ్రైవర్‌తో వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ఆటోలో ఆమె కొంత దూరం తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. వెళ్తున్న కొద్ది మాట తీరు కూడా మారిపోయింది. చివరకు ఆంధ్రప్రభ కాలనీ ప్రాంతంలోకి వచ్చే సరికి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు నమ్మకస్తుడిలా కనిపించిన ఆటో డ్రైవర్ తప్పుగా ప్రవర్తించడంతో బాలిక టెన్షన్ పడింది. తను ఏదో ఆపదలో చిక్కుకుంటున్నట్టు గ్రహించింది. అంతే గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. కాపాడాలంటూ అరచింది.
ఆటో నుంచి బాలిక కేకలు వేస్తుండటంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. ఈ లోపు బాలికని అక్కడే దించేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. భయపడుతున్న బాలికను కాసేపు కూర్చోబెట్టి వివరాలపై ఆరా తీశారు. అప్పటి వరకు జరిగిన విషయాన్ని బాలిక స్థానికులకు చెప్పింది. వెంటనే స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.
స్థానికుల సమాచారంతో ఐదు నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు వచ్చారు. బాధితురాలిని విచారించారు. బాలిక చెప్పిన ఆనవాళ్లు ప్రకారం ఆటో డ్రైవర్‌ను కాసేపటిలోనే అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై కిడ్నాప్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని వివరించారు పోలీసులు.