పవన్ కల్యాణ్ కు ఇటీవల కుడి భుజానికి అత్యంత క్లిష్టమైన సర్జరీ జరిగింది. తీవ్రమైన రొటేటరీ కఫ్ గాయాల కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఇది జరిగింది.
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు జరిగిన సర్జరీల ఖర్చులకు ప్రభుత్వం నిధులు వెచ్చించడం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

- ముంబైలో పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది.
- ప్రజాధనం వాడకుండా, తన వైద్య ఖర్చులన్నీ సొంతంగా భరించారు.
- సినిమాలు, రాజకీయ పర్యటనలతో భుజ గాయాలు తీవ్రమయ్యాయి.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మధ్య తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఈ ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరికొన్ని రోజుల పాటు ఆయనకు రెస్ట్ అవసరమని వైద్యులు ప్రకటించారు. మరో ఆరు నెలల గ్యాప్ తర్వాత ఎడమ భుజానికి చికిత్స చేస్తారు. ఆరు నెలల క్రితం కూడా ఆయన ముక్కుకి చికిత్స చేయించుకున్నారు. ఈ ఖర్చులన్నీ కూడా తన సొంత నిధుల నుంచే చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. ప్రజాధనం తన ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
తీవ్రమైన రొటేటరీ కఫ్ గాయాల కారణంగా ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు మూడున్నర గంటలపాటు అత్యంత క్లిష్టమైన సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్‌కు అయిన ఖర్చులతోపాటు హైదరాబాద్ లేదా అమరావతి నుంచి ముంబైకి ప్రయాణించడానికి అయిన రవాణా ఖర్చులను తన ఖాతా నుంచి వెచ్చించారు. సుమారు ఆరు నెలల క్రితం ఆయన ముక్కుకు జరిగిన సర్జరీ వ్యయాన్ని కూడా ప్రభుత్వ ఖాతాలో వేయకుండా సొంతంగానే పెట్టుకున్నారు.
పవన్ కల్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైద్యుల నివేదికల ప్రకారం, ఈ గాయాలు 2016 నాటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో సినిమాల్లో స్టంట్లు చేస్తున్నప్పుడు ఆయన భుజాలకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అప్పట్లోనే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన రాజకీయ కార్యక్రమాలు, ప్రజల్లో నిరంతరం తిరగడ వల్ల వాటిని నిర్లక్ష్యం చేశారు.
ముంబయి ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అయిన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు.
— Sreekanth B+ve (@sreekanth324) July 15, 2026
వైద్యుల సూచన మేరకు మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించనున్నారు.
త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మరింత శక్తితో ప్రజాసేవలోకి తిరిగి… pic.twitter.com/a58Dqg9Yja
2018లో జరిగిన ప్రజా పోరాట యాత్ర ఆ తర్వాత జరిగిన పర్యటనలు, ముఖ్యంగా 2023-24లో సాగిన సుదీర్ఘ వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో ఈ సమస్య పరాకాష్టకు చేరింది. జనాల్లోకి వెళ్లినప్పుడు అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఆయన చేతులు పట్టుకొని బలంగా లాగడం , కరచాలనం చేయడం వంటి కారణాల వల్ల రెండు భుజాల కండరాలు, టెండన్స్ తీవ్రమైన ఒత్తిడికి లోనై దెబ్బతిన్నాయి. నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ, ఎన్నికలు ముగిసే వరకు ఆయన బాధ్యతలను విస్మరించకుండా పర్యటనలు కొనసాగించారు. ఇటీవల ముక్కు సర్జరీ కోసం నిర్వహించిన స్కానింగ్ పరీక్షల్లో భుజాల గాయం ఎంత తీవ్రంగా ఉందో వెలుగు చూసింది. దీంతో నిపుణులైన వైద్యుల తక్షణమైన సర్జరీ అవసరమని తేల్చి చెప్పారు.
పవన్ కేవలం తన వైద్య ఖర్చులు సొంత నిధుల నుంచి ఖర్చు చేయడమే కాదు, బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా తనకు కీలక ప్రకటన చేశారు. తనకు వచ్చే ప్రభుత్వ జీతం, ఇతర అధికారిక అలవెన్స్‌లను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించబోనని ప్రకటించారు. పంచాయతీ రాజ్ శాఖలో నిధుల కొరత గురించి చెబుతూ, ప్రభుత్వం నుంచి ఎటువంటి అదనపు సదుపాయాలను ఆశించబోనని తెలిపారు.
Frequently Asked Questions
పవన్ కల్యాణ్ కు ఇటీవల ఏ శస్త్రచికిత్స జరిగింది?
పవన్ కల్యాణ్ తన వైద్య ఖర్చులను ఎలా భరిస్తున్నారు?
పవన్ కల్యాణ్ తన వైద్య ఖర్చులను, రవాణా ఖర్చులను కూడా తన సొంత నిధుల నుంచే భరిస్తున్నారు. ప్రజాధనం తన ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ భుజాల గాయాలకు కారణం ఏమిటి?
2016లో సినిమాల్లో స్టంట్లు చేస్తున్నప్పుడు గాయాలు ప్రారంభమయ్యాయి. ప్రజా పోరాట యాత్రలు, అభిమానులతో కరచాలనం వంటివి భుజాలపై తీవ్ర ఒత్తిడిని కలిగించి గాయాలను మరింత తీవ్రం చేశాయి.
పవన్ కల్యాణ్ కు భవిష్యత్తులో ఏ చికిత్స అవసరం?
ప్రస్తుతం కుడి భుజానికి సర్జరీ జరిగింది. మరో ఆరు నెలల గ్యాప్ తర్వాత ఆయన ఎడమ భుజానికి కూడా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు






















