News
News
X

శంకుస్థాపన లేకుండానే బందరు పోర్ట్ పనులు- సీఎం టైం ఇస్తే చాలంటున్న ఎంపీ బాలశౌరి

బందరు పోర్ట్‌కు మరోసారి శంకుస్థాపన ఉండదని పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ప్రకటించారు. ఇక నేరుగా సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతాయన్నారు.  

FOLLOW US: 
Share:

బందరు పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన త్వరలోనే ఉంటుందని గతంలోనే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ప్రకటించారు. అయితే ఈ విషయంలో పునరాలోచన చేసిన ఆయన ఇక పనులకు శంకుస్థాపన కాకుండా ఏకంగా పనులను ప్రారంభించటమే ఉత్తమమని భావిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా శంకుస్థాపనలు జరిగినవేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఖరారు కాగానే, డేట్ ప్రకటిస్తామని తాజాగా వెల్లడించారు.

బందరు పోర్ట్ కోసం ఎదురు చూపులు
బందరు పోర్ట్ నిర్మాణ పనులపై అనేక దశాబ్దాలుగా సందిగ్దత కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు బందరు పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శంకుస్దాపన చేశారు. అయితే ఆనాటి పునాది రాళ్ళు కూడా కనుమరుగు అయిపోతున్నాయి. పోర్ట్ నిర్మాణం జరిగితే దశాబ్దాలుగా కలలు కంటున్న స్థానికుల కల తీరుతుందని అంటున్నారు. కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన కాకుండా, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు బాలశౌరి చెబుతున్నారు.

ఎన్ని కోట్లు ఖర్చు...
బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని గతంలోనే అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడా ఆమోదం లభించింది. దీంతో క్యాబినేట్ సమావేశంలో కూడా రుణం తీసుకునే అంశంపై చర్చించారు. రుణం పొందేందుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనాలు కూడా రూపొందించారు. 

ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున సడన్ బ్రేక్ వాటర్ రూ. 435  కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. 4. 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సివస్తుందని, ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1242.88  కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ రెడీ చేశారు.

విడతల వారీగా....
బందరు పోర్టులో మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం జరుగుతుందని.. మూడు బెర్తుల కోసం రూ.548 కోట్లు, బల్క్ కార్గో కోసం ఒక బెర్త్ .. దీనికి రూ.158 కోట్లు వ్యయం అవుతుందని ఇప్పటికే ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80 వేల టన్నుల బరువుతో వచ్చే షిప్పులు సైతం సురక్షితంగా రాగలుగుతాయన్నారు. లక్ష నుంచి లక్షన్నర బరువుతో ఉండే షిప్పులు వచ్చే బెర్తులను సెకెండ్ ఫేజ్'లో నిర్మిస్తామన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి 1730  ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. మొదటి దశలో ఒక్క ఎకరం ప్రైవేట్ భూమి కూడా తీసుకోవడం లేదన్నారు. రైల్, రోడ్డు నిర్మాణానికి 235 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లను నిర్మించాల్సి ఉంటుందని పేర్ని నాని చెప్పారు. 

Published at : 17 Feb 2023 11:05 AM (IST) Tags: AP Politics Bandar Port ap updates

సంబంధిత కథనాలు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్-ఒక్క ఓటు కూడా పోకుండా ప్లాన్!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్-ఒక్క ఓటు కూడా పోకుండా ప్లాన్!

Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

AP Farmers: ఆ రైతులకు మంత్రి గుడ్ న్యూస్ - ఇన్ పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమాకు ప్రభుత్వం హామీ

AP Farmers: ఆ రైతులకు మంత్రి గుడ్ న్యూస్ - ఇన్ పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమాకు ప్రభుత్వం హామీ

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌