News
News
వీడియోలు ఆటలు
X

Krishna District News: మచిలీపట్నంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు - కటౌట్ ముందు మేకపోతులు బలి

Krishna District News: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడకులను ఆయన అభిమానులు మచిలీపట్నంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఆయన కటౌట్ కు మేకపోతులను బలిచ్చారు. 

FOLLOW US: 
Share:

Krishna District News: నందమూరి తారక రామారావు మనవడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈరోజు (మే 20న) తన 40వ పుట్టినరోజును తారక్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల కేక్ లు కట్ చేస్తూ, రక్తదానాలు చేస్తూ.. ఇలా తమకు తోచిన విధంగా తారక్ బర్త్ డేను సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 

రెండు మేకపోతులు బలి - పేదలకు అన్నదానం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తారక్  ఫొటోలతో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ మేకపోతులను బలి ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలోని G3  థియేటర్ లో సింహాద్రి సినిమాని ప్రదర్శించారు. సినిమా రీరిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. తారక్ కటౌట్ కి రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం పేదలకు అన్నదానం నిర్వహించారు. జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్ జెండాలు పట్టుకుని బైక్ లపై నగర పుర వీధుల్లో చెక్కర్లు కొట్టారు.

Published at : 20 May 2023 04:21 PM (IST) Tags: AP News Junior NTR Tarak Birth Day NTR Birth Day Celebrations Fans Celebrated Tarak Birth Day

సంబంధిత కథనాలు

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం