By: ABP Desam | Updated at : 28 May 2023 04:19 PM (IST)
కొడాలి నాని (ఫైల్ ఫోటో)
Gudivada News: గుడివాడ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు, సవాళ్లు చేశారు. చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్ (Nara Lokesh) దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాలు విసిరారు. ఎన్టీఆర్ వల్ల పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు, గతిలేక రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకోవడానికి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని కొడాలని నాని ఆరోపించారు. ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని అన్నారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా, ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మండిపడ్డారు. గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో (NTR Centenary Celebrations) కొడాలి నాని పాల్గొన్నారు. అక్కడ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు.
టీడీపీ స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది కుక్క బతుకు అంటూ కొడాలని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చెప్పుదెబ్బ తప్పదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. చంద్రబాబు, లోకేష్‌ను తరిమికొట్టి ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారు.’’ అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న ఒకేఒక్క మగాడు జూ. ఎన్టీఆర్
“నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో ఉన్న ఒకేఒక్క మగాడు తారక్. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ లోని ఏ ఒక్కరిని ముందుకు రాకుండా చేసి చంద్రబాబు ఒక్కడే ముందు కనిపిస్తాడు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూ. ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయానో చెప్పినా, తన తాత మీద ఉన్న విపరీతమైన గౌరవం తోనే వారితో స్టేజి మీద కనిపించకూడదనే రాలేదు అనుకుంటున్నాను. అందుకు తారక్ కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఎన్టీఆర్ అభిమానిగా. మొసలి, పాము లాంటి భయంకరమైన కన్ను ఆర్పని మూడో జీవిని నేను చూశాను. ఆయనే చంద్రబాబు నాయుడు. త్వరలో నేను తీయబోయే ‘వ్యూహం’ సినిమాలో తొలిసారి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ను అరటిపండు ఒలిచి పెట్టినట్లు పెడతాను. మీరు ఆ తియ్యదనాన్ని ఆస్వాదించండి” అన్నారు రామ్ గోపాల్ వర్మ.
రజనీకాంత్ కూడా వెన్నుపోటు పొడిచినట్లే!
“ఒకవేళ సీబీఎన్ బ్యాచ్ అనుకుంటున్నట్లు లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అనుకుంటే, ఆయనకు బుర్రలేదు అనుకోవాలా? ఒకవేళ బుర్రలేకుండా అలాంటి పని చేసి ఉంటే, ఇంకా ఆయనను ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకు ఫోటోలు పెడుతున్నారు? దండలు వేస్తున్నారు? మీరు అన్న మాట మీదనైనా నిలబడాలి కదా? మీరు చెప్పే మాట మీద కూడా నిలబడ్డం లేదు. రజనీకాంత్ అనే వారు సూపర్ స్టార్. ఆయనను సూపర్ స్టార్ చేసింది ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి వచ్చి, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పక్కనే కూర్చొని ఆయనను పొగడటం అంటే రజనీకాంత్ కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమే అవుతుంది” అన్నారు ఆర్జీవీ.
Minister RK Roja: షూటింగ్ అనుకొని బాలకృష్ణ తొడలు కొడుతున్నారు, బావ కళ్లలో ఆనందం కోసమే - రోజా ఎద్దేవా
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ సిలబస్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక- సమావేశాలు ముగిసేవరకు ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>