అన్వేషించండి

Kesineni nani : అవినీతి మరక అంటని నేత చంద్రబాబు - కేశినేని నాని ప్రశంసలు !

చంద్రబాబుపై కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానన్నారు.


Kesineni nani : టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు.  ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం  పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న కింది స్థాయి నాయకులు ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు.వారిని రాజకీయంగా ఎదగకుండా ఈ ప్రాంతం వాళ్లు వాడుకోని వదిలేశారన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే ముఖ్య పదవులు అవే వస్తాయన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కేశినేని నాని అన్నారు.

నోటీసులు వ‌చ్చినా స‌మాధానం చెప్పుకునే నిబ‌ద్ద‌త‌,క‌మిట్ మెంట్ చంద్ర‌బాబు వ‌ద్ద ఉంది ..  నిస్వార్ధంగా అవినీతి మ‌చ్చ లేకుండా రాష్ట్రఆన్ని ఏలిన వ్య‌క్తి చంద్ర‌బాబు కేశినేని స్పష్టం చేశారు.  నోటీసులు ఇవ్వ‌డం రాజ‌కీయ‌ప‌ర‌మైంది..ఇది చాలా రొటీన్ విష‌యమన్నరాు. నోటీసులు రాజ‌కీయ‌ప‌రంగా చిన్న ఈక్వేష‌న్ మాత్ర‌మే డైరీలో చంద్ర‌బాబు తాలూకా  Xకి ,Yకి ఇచ్చిన‌ట్లు రాసుకుంటారు... అలా రాసుకుంటే చంద్ర‌బాబుకు ముట్టిన‌ట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.  నాకు తెలిసి అలా జ‌రిగి ఉండ‌రన్నారు.  ఇండియా పాలిటిక్స్ లో అవినీతి మ‌ర‌క అంట‌ని కొద్ది మందిలో చంద్ర‌బాబు ఒక‌రన్నారు.  ఈ రాష్ట్రం కోసం 40 ఏళ్లు కష్టపడి అవినీతి మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు.                        

కేశినేని నాని ఇటీవలి కాలంలో టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆయన టీడీపీకి దూరమవుతారన్న చర్చ జరుగుతోంది. కేశినేని నాని సోదరుడు శివనాథ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇద్దరికీ అభిప్రాయబేధాలున్నాయి. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని.. కేశినేని నాని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తన ఐడియాలజీ టీడీపీనేనని అంటున్నారు. తాను టీడీపీ తరపునే పోటీ చేసి మూడో సారి ఎంపీగా పార్లమెంట్ కు వెళ్తానని చెబుతున్నారు.  దీంతో ఆయన మనసు మార్చుకున్నారన్న  వాదన వినిపిస్తోంది.                         

విజయవాడ టీడీపీలో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. అందుకే.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. బెజవాడ టీడీపీలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి మారింది. చంద్రబాబు అసంతృప్తిని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ లోపు కేశినేని నాని అసంతృప్తి సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఆయన సర్దుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.         

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Look Back 2024: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
Embed widget