News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

KCR New Convoy in Vijayawada: కేసీఆర్ కాన్వాయ్ విజయవాడలో, గుట్టుచప్పుడు కాకుండా కార్లకు కొత్త ఫిట్టింగ్స్

KCR Convoy:హైద‌రాబాద్ నుండి కార్గో విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి కార్గోను తీసుకువ‌చ్చారు. త‌రువాత సాయంత్రం తిరిగి అదే కార్గో విమానంలో కార్గో విమానం ద్వారా కార్లను త‌ర‌లించారు.

FOLLOW US: 
Share:

KCR Convoy In Vijayawada: తెలంగాణ సీఎం కే.చంద్ర‌శేఖర్ రావు కాన్వాయ్ వాహ‌నాలను బెజ‌వాడ‌లో సిద్దం చేశారు. ప్ర‌ఖ్యాత వాహ‌న త‌యారీ సంస్ద టాటా కేసీఆర్ కు అస‌వ‌రం అయిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల‌ను రెడీ చేసింది. ఇందులో భాగంగా వాహ‌నాల‌కు అవ‌స‌రం అయిన అద‌న‌పు ఫిట్టింగ్స్ కోసం హైద‌రాబాద్ నుండి ప్ర‌త్యేక కార్గో విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి వాటిని తీసుకువ‌చ్చారు. గ‌న్న‌వ‌రం స‌మీపంలోని మ‌ల్ల‌వ‌ల్లి పారిశ్రామిక వాడ‌లో వాహ‌నాల‌కు అవ‌స‌రం అయిన ఫిటింగ్స్ ను చేసిన త‌రువాత సాయంత్రం తిరిగి అదే కార్గో విమానంలో కార్గో విమానం ద్వారా హైద‌రాబాద్ కు త‌ర‌లించారు.

అయితే ఈ వ్య‌వ‌హ‌రం అంతా గుట్టు చ‌ప్పుడు కాకుండా అత్యంత ర‌హ‌స్యంగా సాగిపోయింది. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుండి వాహ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు,సీఎం జ‌గ‌న్ కాన్వాయ్ అని అంతా భావించారు. అవే వాహ‌నాలు రోడ్ మీద వెళుతున్న‌ప్పుడు కూడా జ‌నం అంతా ఆస‌క్తిగా చూశారు. అందులోనే జ‌గ‌న్ ఉన్న‌ట్లుగా భావించారు. అయితే ఆ త‌రువాత అస‌లు విష‌యం తెలిసింది.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల కోస‌మా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాలపై న‌జ‌ర్ పెట్టారు. దీంతో ఆయ‌న దేశ వ్యాప్తంగా తిరిగేందుకు ప్ర‌త్యేక వాహ‌నాలు అవ‌స‌రం ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కాన్వాయ్ ను రెండు సెట్లుగా రెడీ చేస్తున్న‌ట్లు భావిస్తున్నారు. ఒక కాన్వాయ్ హైద‌రాబాద్ లో అందుబాటులో ఉంచ‌టం, మ‌రో కాన్వాయ్ లోని వాహ‌నాల‌ను డిల్లీలో వినియోగించేందుకు ప్లాన్ వేశార‌ని చెబుతున్నారు. అందుకే మెత్తం 15 వాహ‌నాలు రెడీ చేయిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏడు వాహ‌నాలను ఒక వాహ‌న శ్రేణిలో, మ‌రో ఏడు వాహ‌నాల‌ను మ‌రో వాహ‌న శ్రేణిలో ఉంచేందుకు ప్లాన్ వేసిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. నూత‌న వాహ‌నాలు అన్ని హై ఎండ్ మోడ‌ల్స్ లో ఉన్న‌వే కావ‌టం విశేషం. అంతే కాదు వాహ‌నాల్లో అత్యాధునిక స‌దుపాయాలు కూడా సిద్దం చేస్తున్నారు. వీటిలో కొన్నింటిలో జామ‌ర్ వాహ‌న‌లు కూడా ఉన్నాయి.

కార్ తోనే వివాదాలు
రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఉంది. స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీ అంటే ఎదొక గుర్తు ఉంటుంది. అందులో స్పెషాలిటి ఏముంద‌నుకుంటే, అక్క‌డే అస‌లు విష‌యం ఉంది. కేసీఆర్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌నే చాలాసార్లు ఇంట‌ర్వ్యూల్లో కూడా స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగానే ఆయ‌న పార్టీకి కూడా కారు గుర్తునే ఎంచుకున్నారు. ఇక ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు త‌రువాత సీఎంగా బాధ్యత‌లు స్వీక‌రించిన త‌రువాత కూడా కేసీఆర్ త‌న కాన్వాయ్ లో ప్ర‌త్యేక వాహ‌నాల‌ను ఎంచుకున్నారు. ఇది కూడ రాజకీయంగా తీవ్ర స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే వీటిని కేసీఆర్ అస‌లు పట్టించుకోలేదు. త‌న‌కు అవ‌స‌రం అనుకున్న‌ప్పుడల్లా కాన్వాయ్ లో కొత్త త‌రహా అదునాత‌న వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకున్నారు. ఇటీవ‌లే 5 ల్యాండ్ క్రూజ‌ర్ ప్రాడో వాహ‌నాల‌ను కూడా కొనుగోలు చేశారు. ఒక్కో వాహ‌నం ఖ‌రీదు రూ.కోటి 30లక్ష‌లు. అంత‌కు ముందు ఉన్న ఫార్చూన‌ర్ వాహ‌నాల స్థానంలో వీటిని కొనుగోలు చేశారు. దీని ద్వారా అత్యంత ఖ‌రీద‌యిన కాన్వాయ్ వాహ‌నాలు ఉన్న జాబితాలో కేసీఆర్ చేరారు.

Published at : 22 Jul 2022 12:56 PM (IST) Tags: CM KCR Convoy kcr convoy vehicles kcr convoy in vijayawada kcr convoy repairs in vijayawada telangana cm convoy

ఇవి కూడా చూడండి

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే