ఆర్థరైటీస్ కారణంగా యువకుల్లో వైకల్యం- జాగ్రత్త పడాలంటున్న వైద్యులు
ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను చాలా మంది వృద్ధాప్యపు సమస్యలని తప్పుగా అర్థం చేసుకుంటన్నట్లు నిపుణులు గుర్తించారు.
ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డా. బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. అక్టోబర్ 12న ఆర్థరైటీస్ దినాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడిన డా. పాపారావు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నాట్లు తెలిపారు. కీళ్ల వాపులు - నొప్పులు వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయని చెప్పారు. సాధారణ ప్రజలలో ఆర్థరైటీస్ గురించి అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు.
“ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను చాలా మంది వృద్ధాప్యపు సమస్యలని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు. ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులలో 65 సంవత్సరాలకు పై బడిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా ఈ అపోహ విస్తృత ప్రచారంలో ఉండటానికి కారణం అవుతున్నది. అయితే దాదాపు ముప్పయ్ శాతం మంది 65 ఏళ్లకంటే చిన్న వయస్సులోనే ఈ వ్యాధికి గురయినా ఆర్థరైటిస్ అని గుర్తించక తీవ్రంగా నష్టపోతున్నారు. వీరి కొందరు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న యువతీ యువకులు కూడా. “రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ల నివారించే చికిత్సలేదు. చేయగలిగిందల్లా శరీరం బరువు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వ్యాయామం, తగ్గించటం, వంటి చర్యలు తీసుకోవటమే. వీటికి తోడుకీళ్ల నొప్పులను అదుపుచేసేందుకు తోడ్పడగల కొన్ని మందులను సిపార్సుచేస్తాం.” అని డాక్టర్ బెజవాడ పాపారావు చెప్పారు.
పలు సందర్బాలో ఫిజియోథెరపీ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నది. కీళ్ల కదలిక కష్టంగా ఉంటుంది. కానీ పిజియోథెరపీ నిపుణుల పర్యవేక్షణలో ప్రారంభించి కొనసాగించే కదలిక ఆర్థరైటిస్ నొప్పిని అదుపుచేయటానికి సాయపడుతుంది. "ఆర్థరైటిస్ వెన్నెముక రుగ్మతలకు దారి తీస్తుంది, 80 నుండి 85 శాతం వెన్నునొప్పి కేసులకు నిర్దిష్ట కారణం ఉండదు. యువకులలో వైకల్యానికి ప్రధాన కారణాలలో వెన్నునొప్పి ఒకటిగా నిలుస్తుంది" అని డాక్టర్ పాపారావు హెచ్చరిస్తున్నారు.