News
News
వీడియోలు ఆటలు
X

నేడే బెజవాడలో ‘వాలంటీర్లకు వందనం’, పాల్గొననున్న సీఎం జగన్ - 3 విభాగాల్లో బహుమతులు

వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

FOLLOW US: 
Share:

వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. వరసగా మూడో ఏడాది ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం చేయనున్నారు.

హాజరు కానున్న సీఎం

విజయవాడ నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వారంటీరుగా ఉంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడి సేవాభావంతో లంచాలు, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్న వాలంటీర్లకు సెల్యూట్‌ చేస్తూ వారి సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా ప్రతి ఏటా చిరు సత్కారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.

243.34 కోట్ల నగదు పురస్కారాలు

అవినీతికి తావులేకపోవడం, సచ్ఛీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. తాజాగా అందిస్తున్న రూ. 243.34 కోట్లతో కలిపి ఇప్పటి వరకు వాలంటీర్లకు  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారాల మొత్తం రూ.705.68 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ/వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు, గ్రామ/ వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు గాను వారిని ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది.

పింఛన్ల పంపిణి కీలకం

జగన్ సర్కార్ పాలన ప్రారంభం అయిన తరువాత వాలంటీర్ల నియామకం సంచలనం అయ్యింది. పెన్షన్లతో పాటు రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు వాలంటీర్ వ్యవస్థకు గుర్తింపు ఇవ్వటం బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది. వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు ’దిశ’ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటుగా,జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులుగా వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించింది.

అన్ని నియోజకవర్గాల్లో పండుగలు..
మే 19 వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు పెడుతున్నారు. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందిస్తున్నారు.

సేవా వజ్ర విభాగంలో...

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం చేయనున్నారు.

సేవా రత్న విభాగంలో..

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌ 1 శాతం ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల ప్రధానం చేస్తున్నారు.

సేవా మిత్ర విభాగంలో...

సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాల ప్రధానం చేస్తారు.

Published at : 19 May 2023 05:00 AM (IST) Tags: AP Latest news YSRCP News Telugu News Today AP CM News YS Jagan News AP VOLUENTERS

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్