Cancellation of Trains: మొంథా తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, కొన్ని రైళ్లు దారి మళ్లింపు
Trains Cancellation details | మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైల్వేశాఖ కొన్ని రైళ్లు రద్దు చేయగా, కొన్ని సర్వీసులు దారి మళ్లించింది.

Cyclone Montha Impact | అమరావతి: మొంథా తుపాను తీరం దాటినా ఏపీలో పలు జిల్లాల్లో దాని ప్రభావం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పలు రైళ్లు, విమాన సర్వీసులను ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రద్దు చేశారు. నేడు, రేపు సైతం కొన్ని రైలు సర్వీసులను రైల్వే అధికారులు రద్దు చేయగా, కొన్ని సర్వీసులను దారి మళ్లిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ విభాగం పీఆర్వో నుస్రత్ ఎం. మండ్రుప్కర్ ఓ ప్రకటనలో తెలిపారు.
రద్దు చేసిన రైళ్లు:
1) ట్రెయిన్ నెంబర్ 22204 సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 29/10/2025న రద్దు
2) ట్రెయిన్ నెంబర్ 12703 హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 30/10/2025న రద్దు చేశారు.
– 67279 నర్సాపురం – నిడుదవోలు (29.10.2025) – ఎస్‌సిఆర్ బులెటిన్ నం.15
– 22204 సికింద్రాబాద్ – విశాఖపట్నం (29.10.2025) ఎస్‌సిఆర్ బులెటిన్ నం.17
– 12703 హావ్రా – సికింద్రాబాద్ (30.10.2025)
దారి మళ్లించిన రైళ్లు:
– 18189 టాటానగర్ – ఎర్నాకులం (28.10.2025)
మార్గం: టిట్లాగఢ్, లఖోలీ, రాయపూర్, గోండియా, కలంనా, నాగ్‌పూర్, బల్లార్షా, బెల్లంపల్లి, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ
గమనిక: రీ-రివైజ్డ్ మార్గం (ఎస్‌సిఆర్ బులెటిన్ నం.14)
"Bulletin No.16: SCR PR No.605, dt.29.10.2025 on "Restoration of Trains" pic.twitter.com/COR2MbXwIR
— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025
– 12703 హావ్రా – సికింద్రాబాద్ (28.10.2025) సాధారణ మార్గంలో నడుస్తుంది (బులెటిన్ నం.15 ప్రకారం ముందు తెలిపిన మార్గం మార్చారు)
– 12245 హావ్రా – ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు (28.10.2025) సాధారణ మార్గంలో నడుస్తుంది (బులెటిన్ నం.15 ప్రకారం పాత మార్గం మార్చారు)
– 22643 ఎర్నాకులం – పాట్నా (27.10.2025) మార్గం: విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, బిలాస్పూర్, ఝార్సుగుడా, రౌర్‌కెలా, సినీ, పురులియా, ఆసన్సోల్ గమనిక: రీ-రివైజ్డ్ మార్గం (బులెటిన్ నం.6 ప్రకారం)
పునరుద్ధరించిన రైళ్లు:
- 17220 – విశాఖపట్నం – మచిలీపట్నం (29.10.2025) సాధారణ షెడ్యూల్ ప్రకారం తిరిగి నడుస్తుంది
🚆 Despite the impact of #CycloneMontha, Vijayawada Division teams are on the ground ensuring passenger safety and comfort.
— DRM Vijayawada (@drmvijayawada) October 29, 2025
Train No. 20806 AP Express (New Delhi –Visakhapatnam) was safely terminated at Vijayawada Railway Station. 329 passengers were guided to waiting halls and… pic.twitter.com/nq0KfvuKNs
#CycloneMontha ప్రభావంతో ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని కల్పించడానికి విజయవాడ డివిజన్ బృందాలు రంగంలోకి దిగాయి. రైలు నంబర్ 20806 AP ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-విశాఖపట్నం) విజయవాడ రైల్వే స్టేషన్‌లో సురక్షితంగా నిలిపివేశారు. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికులను వెయిటింగ్ హాళ్లకు తీసుకెళ్లారు. వారికి తదుపరి రైళ్లలో ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణీకులకు సహాయం చేయడానికి అన్ని క్యాటరింగ్ స్టాళ్లు 24 గంటలూ పనిచేశాయి.
మొంథా తుపాను మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల ప్రాంతంలో నరసాపురానికి సమీపంలో తీరం దాటింది. అయితే దాని ప్రభావంతో మరో 24 గంటలపాటు వర్షాలు కురవనున్నాయి. కోస్తా జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సైతం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






















