By: ABP Desam | Updated at : 15 Mar 2022 08:01 AM (IST)
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas Warns Janasena Chief Pawan Kalyan: విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరికోసం పెట్టాడో ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చాడని, తాను చంద్రబాబు కోసం పని చేయడానికోసమే ఉన్నానని జనసేన వ్యవస్థాపక దినోత్సవంలో స్పష్టత ఇచ్చాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అని.. నీ బెదిరింపులు ఏమైనా ఉంటే సినిమాల్లో చూసుకోవాలని.. పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. పవన్ రాజకీయాల్లో ఊసరవెల్లి లాంటివాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోలికొచ్చినా, మా వైఎస్సార్ సీపీ నాయకుల జోలికొచ్చినా ఖబడ్దార్ అని వెల్లంపల్లి హెచ్చరించారు.
అందువల్లే పవన్ ఘోర పరాజయం..
జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్లు అయిందని, కానీ నేటికీ ఆ పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు తెలియజేశారు. కానీ పవన్ ఉద్దేశం ఏంటో తెలుసు కనుకే ప్రజలు జనసేన అధ్యక్షుడ్ని రెండు స్థానాల్లోనూ ఓడించారని గుర్తుచేశారు. బీజేపీ రూట్ మ్యాప్ కోసం సిద్ధంగా ఉన్నాడని చెప్పడం తన పార్టీ కోసం పని చేయడం కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలి పోకూడదని పదే పదే పవన్ ప్రస్తావించడం.. చంద్రబాబును సీఎం చేయాలని జనసేనాని ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో ఏర్పడిన కూటమిలా ఏర్పడి వైఎస్సార్‌సీపీని అధికారానికి దూరం చేయడానికి మాత్రమే పవన్ పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో అతడికి స్పష్టత లేదని విమర్శించారు.
ఆవిర్భావ సభ కాదు.. అమ్ముడుపోయే సభ..
పవన్ కళ్యాణ్ అమరావతిలో నిర్వహించినది జనసేన ఆవిర్భావ సభ కాదని, బీజేపీకి, టీడీపీకి తాను అమ్ముడుపోయే సభ అని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. ఐపీఎల్ తరహాలో ప్యాకేజీలు తీసుకోవడం, మళ్లీ ప్యాకేజీలను పంచుకోవడానికే పవన్ జనసేన సభ నిర్వహించారని ఆరోపించారు. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు తప్ప, ప్రజలు అన్ని ఎన్నికల్లోనూ తమ పార్టీనే ఎందుకు గెలిపిస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యే పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు.
వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేవ్..
అమరావతి రైతులు పెట్టిన పెరగన్నం తిన్న పవన్ కళ్యాణ్, ఫ్లైట్ ఎక్కి ప్యాకేజీలు తీసుకుని రూట్ మార్చాడు. వేరే పార్టీలకు అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు సీఎం జగన్‌ను విమర్శించడమా, మా నేతలపై వ్యాఖ్యలు చేయడమా అంటూ జనసేనానిపై మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. మేం కనుక వ్యక్తిగత విమర్శలు మొదలుపెడితే పవన్ 10 నిమిషాలు కూడా తట్టుకోలేడు. రెమ్యునరేషన్ తీసుకుని హాయిగా సినిమాలు చేసుకోవడం ఆయనకే మంచిదన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు కూల్చినప్పుడు పవన్ గాడిదలు కాసాడా... పందులు కాసాడా? అంటూ వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఓ కమెడియన్ అని, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
Also Read: Ysrcp on Pawan Kalyan: టీడీపీ, బీజేపీని కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు - మంత్రి పేర్ని నాని
Also Read: Janasena Manifesto : 2024లో అధికారమే టార్గెట్- జనసేన మేనిఫెస్టో ఇదే, ఏటా 5 లక్షల ఉద్యోగాలు!
Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే !
Vijayawada News : ఇంద్రకీలాద్రిపై అవకతవకలు, దుర్గమ్మ చీరలు మాయం!
AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల
Secunderabad Roits: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావే ప్రధాన సూత్రధారి- తేల్చిన రైల్వే పోలీసులు- రిమాండ్‌కు తరలింపు
TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు