Perni Nani About Pawan: చెప్పులు తరువాత, ముందు జనసేన గాజు గ్లాస్ పోయింది చూసుకో- పవన్ కు పేర్నినాని కౌంటర్
Perni Nani About Pawan Kalyan: 13వ రోజు చెప్పులు పోతే, మూడు రోజుల తరువాత 16వ తేదీన గుర్తుకొచ్చిందా పవన్ కు అని పేర్ని నాని సెటైర్లు వేశారు. ముందు జనసేన గుర్తు గాజు గ్లాసు గురించి ఆలోచించాలన్నారు.
Perni Nani About Missing Chappals of Pawan Kalyan: కృష్ణాజిల్లా: పిఠాపురం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ గా తీసుకున్నారు. పోయిన చెప్పుల సంగతి తరువాత కానీ, ముందు పోయిన జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ సంగతి చూసుకో అంటూ పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు సీఎం పదవి ఇవ్వండి, గెలిపించాలని ప్రజలను రిక్వెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. అడుక్కుంటే సీట్లు, ఓట్లు రావని ప్రజల కోసం పనిచేస్తేనే ఫలితం ఉంటుందని ఏపీ మంత్రులు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.
పేర్ని నాని వద్ద పవన్ చెప్పుల విషయం ప్రస్తావన..
పేర్ని నాని జర్నలిస్టులను చూడగానే మిట్ట మధ్యాహ్నం వచ్చేశారు భోజనం చేశారా అని అడిగారు. పవన్ కళ్యాణ్ వి చెప్పులు పోయాయంటున్నారు. ఎవరికైనా దొరికితే ఇప్పించండి అని అన్నారని పేర్ని నానితో మీడియా ప్రస్తావించింది. పవన్ చెప్పులు ఎప్పుడు, ఎక్కడ పోయాయని అడగగా.. అన్నవరం సత్యదేవుని ఆలయానికి వెళ్లిన సమయంలో పోయాయని, అయితే ఆ విషయాన్ని పిఠాపురం సభలో జనసేనాని చెప్పారని జర్నలిస్టులు పేర్ని నానికి తెలిపారు. 13వ తేదీన చెప్పులు పోతే, మూడు రోజుల తరువాత 16వ తేదీన గుర్తుకొచ్చిందా పవన్ కు అని సెటైర్లు వేశారు.
చెప్పులు ప్రొడ్యూసర్ కొనిస్తారు, జనసేన సింబల్ సంగతి చూసుకో!
చెప్పులు పోతే పవన్ కళ్యాణ్ 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 18, 19న రాత్రి తన చెప్పులు పోయాయన్నారు. తాను లింగమనేనికి చెందిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లగా ఒక చెప్పు పోయిందన్నారు పేర్ని నాని. గుడి నుంచి బయటకు రాగా ఓ చెప్పు లేదన్నారు. ఓ చెప్పు పోయి 9 నెలలు అయిందని, తీసుకెళ్లినోడు ఒక్క చెప్పు ఏం చేసుకుంటాడో తెలియదన్నారు. మూడు రోజుల కిందట ఈయన రెండు చెప్పులు పోతే కంగారు ఏమీ లేదన్నారు. నా చెప్పు పోయిందని ఎవరిని అనుమనిస్తాం, ఎదురుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉంటే ఆయనను అనుమనిస్తామా, పద్ధతి కాదు కాదని చురకలు అంటించారు. పోయిన చెప్పులను ఎవరొకరు కొంటారు, ఎవరో ఒక ప్రొడ్యూసర్ అవి కొంటారు అంతేగాని ముందు పోయిన జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ చూసుకో అని పవన్ కళ్యాణ్ కు సూచించారు.
పవన్, పేర్ని నానిల మధ్య కొనసాగుతున్న చెప్పుల వివాదం!
అన్నవరం గుడికి వెళితే తన రెండు చెప్పులు కొట్టేశారని, చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదని, కుర్తా వేసుకుంటే బాగుంటుందని షూస్ వేసుకుని వచ్చానని పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఇష్టమైన రెండు చొప్పులు ఎవరో దొంగిలించారని, మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కొట్టేసిందంటూ మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేవారు పవన్. అంతకుముందు పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ చెప్పులు చూపించి మక్కెలిరగ్గొడతానని అంటున్నారని, ఆయన వద్దే చెప్పులున్నాయా.. మాకు ఉన్నాయి మేం చెప్పులు చూపిస్తాం మక్కెలిరిగిపోతాయనడంతో చెప్పుల వివాదం తారా స్థాయికి చేరింది.