అన్వేషించండి

AP Diamonds: ఎన్టీఆర్ జిల్లాలో దొరికిన అరుదైన వజ్రం, వ్యాపారులు భారీ ఆఫర్! లంచ్ బాక్సులతో వెళ్లి వజ్రాల వేట

Diamond Found in NTR District: ఓ కుటుంబం ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికింది. వ్యాపారులు వారికి భారీ ఆఫర్ చేశారు.

Diamond Found in NTR District: ఓ వ్యక్తికి దొరికిన వజ్రం దొరకడంతో విషయం ఆనోటా ఈనోటా పాకడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఇది జరిగింది. అరుదైన వజ్రం దొరకడంతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.

సత్తెనపల్లి సమీపంలోని బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు ఉండటం, ఇది షడ్ బుజి వజ్రం కావడం తో మంచి డిమాండ్ వచ్చింది. దీని విలువ అరకోటి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు షడ్ బుజి వజ్రం ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

వజ్రం దొరికిందని ఆనోటా ఈనోటా పాకడంతో స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు ఆ కుటుంబాన్ని సంప్రదించారు. రూ.40 లక్షలు ఇస్తామని, తమకు ఆ అరుదైన వజ్రాన్ని విక్రయించాలని బేరసారాలు జరిపారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆరు భుజాలు కలిగిన వజ్రానికి మరింత ధర వస్తుంది, మంచి ఆఫర్ కోసం వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. గుడిమెట్లతో పాటు ఏపీలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల కోసం నిరంతరం ఏదో చోట తవ్వుతూ ఉంటారని తెలుస్తోంది.

ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికిందని తెలియడంతో గుడిమెట్లకు స్థానికులు క్యూ కట్టారు. లంచ్ బాక్సులతో సహా అక్కడ వాలిపోతున్నారు. కుటుంబాలు కుటుంబాలు గుడిమెట్లకు వచ్చి వజ్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట కొనసాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం రాజుల పాలనలో ఉందని, కనుక వజ్రాలు దొరుకుతాయని స్థానికులు నమ్ముతున్నారు. రాత్రిళ్లు సైతం లైట్లు వేసుకుని మరీ భారీ గుంతలు తవ్వుతూ వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇటీవల ఒకేరోజు మూడు వజ్రాలు దొరికాయని ప్రచారం జరిగిన తరువాత గుడిమెట్లకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget