YS Jagan: గెలిచే ఛాన్స్ ఉంటేనే టికెట్, లేదంటే అంతే సంగతి - ఎమ్మెల్యే లతో భేటీలో ఇదే చెప్పనున్నారా !
గెలిచే ఛాన్స్ ఉంటేనే టికెట్, లేదంటే అంతే సంగతులు.. మొదట పార్టీ తర్వాత నాయకులు ఇదే ఫిలాసఫీతో సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు, ఇంఛార్జులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ ఏం చెప్పనున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిందా, ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ అధినేత జగన్ సూచించే అవకాశం ఉంది. డిసెంబర్ 14వ తేదీ న సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారని అధికార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
గడప గడపపై చర్చ..
గడప గడపకు మన ప్రభుత్వం దాదాపు పూర్తి కావచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువు ముగిసింది. ఇప్పటికే నివేదికలు సీఎం జగన్ టేబుల్ దగ్గరకు వచ్చేశాయి. ఏ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది, ఎవరెవరు ప్రజల్లో తిరిగారు, ఎవరు రెస్ట్ లో ఉన్నారు, అసలు పూర్తిగా మ్యూట్ మూడ్ లో ఉన్న వారు ఎంత మంది, ఎవరు బెస్ట్ ఈ జాబితా వివరాలు సీఎం దగ్గర ఉన్నాయి. దీంతో ఈ నెల 14 న జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ సుమారు 30 మందికి పైగా ఎమ్మెల్యే లపై అసంతృప్తి తో ఉన్నట్టు సమాచారం. ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు దూరంగా ఉన్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే ల పనితీరు కూడా ఆశించినట్లు లేదని సమాచారం. దీంతో ఈ సమావేశంలో సీఎం డైరెక్ట్ గా చెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
నో ఫీలింగ్స్.. ఓన్లీ విన్నింగ్...
మొహమాటం లేదు. ఫీల్ అవుతారని ఎలాంటి ఫీలింగ్ లేదు. గెలిచే ఛాన్స్ ఉంటేనే టికెట్, లేదంటే అంతే సంగతులు.. మొదట పార్టీ తర్వాత నాయకులు ఇదే ఫిలాసఫీతో సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు, ఇంఛార్జులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా పరిశీలకులతో జరిగిన సమావేశం వివరాలు సీఎం జగన్ ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. పరిశీలకులు వచ్చారనే అసంతృప్తి ఉన్న నేతలకు జగన్ ఇప్పటికే క్లాస్ తీసుకున్నారు. అయినా కొంత మంది తమ పనితీరు మార్చుకోలేదని జగన్ కు రిపోర్ట్ లు చెబుతున్నాయి. సర్వేల పేరుతో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లను సీఎం జగన్ పరుగులు పెట్టించినంత మాత్రాన, తాము గెలిచే అవకాశాలు లేకుండా పోతాయని ఎలా చెప్పలగరు, అనే సందేహాలు పార్టీ వర్గాలు వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆయా అంశాలను జగన్ ముందు ఉంచారు. దీంతో ఒక పక్క ఫీడ్ బ్యాక్, మరో పక్క ఎన్నికలకు సన్నద్ధం చెయ్యడం, ఈ రెండే 14న జరిగే మీటింగ్ అజెండాగా వైసీపీ నేతలు చెబుతున్నారు.
పార్టీ నిర్ణయాలుపైనే విజయాలు...
అధికారంలో ఉన్న పార్టీ, అందులోనూ కేవలం జగన్ చరిష్మాతోనే ఏకంగా 151సీట్లను దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర నెలకొల్పన వైసీపీ ఇప్పుడు 175 స్దానానాలను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ తో ముందుకు వెళుతుంది. ఇందులో సంక్షేమం ప్రధాన అజెండాగా జగన్ సాహసోపేతమయిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా భారం అయినప్పటికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం ప్రధాన అజెండాగా పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని కలుపుకొని ముందుకు నడిపిస్తున్న జగన్, తన ముందు చూపుతో వ్యూహత్మంగా రాజకీయాలను నడిపిస్తున్నారు. దీంతో శాసన సభ్యులు, ఎంపీలు ఎవరయినా సరే, జగన్ ను కాదనే పరిస్దితి లేదు. అలాగని పని చేయటానికి తమకు ఇబ్బంది ఉందని చెప్పే నాయకులకు జగన్ ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి రావటం తో పాటుగా మొత్తం 175 స్థానాలను సైతం దక్కించుకోవటమే ఏకైక మార్గంగా జగన్ తన సైన్యంతో రెడీ అవుతున్నారు.