అన్వేషించండి

Chandra Babu Meets Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చర్చించారంటే?

Chandrababu Meets Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాత్రి సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో ఆర్థిక స్థితిగతులను చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh CM Chandra Babu: ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కీలకాంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి  కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమైన ఆయన ఏపీ ఆర్థిక వ్యవస్థపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయికి దిగజారిందో ఎన్ని అక్రమాలు జరిగాయో సమగ్రంగా వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం సాయం చేయకుండా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఆయన అర్థమయ్యేలా చెప్పారట. 

కేంద్రమంత్రి అమిత్‌షా జరిగిన సమావేశ వివరాలను ఎక్స్‌(X) వేదికగా చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేయాల్సిన కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆర్థిక వ్యవస్థను రూపులోకి తీసుకోవాల్సిన అవసరాన్ని  గుర్తించామని అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు కేంద్రమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంట పాటు వీరి చర్చలు సాగాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు, విభజన తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యచరణను చర్చించినట్టు పేర్కొన్నారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. 

"ఈరోజు ఢిల్లీలో నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నాను. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారింది. జరిగిన విధ్వంసకర పరిస్థితిని తెలియజేశాను. 2019-24 మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. అప్పులు  జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల గురించి చర్చించాను. గత ప్రభుత్వ ఆర్థిక అసమర్థత, నిర్వహణ లోపం, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

ప్రజలు కూటమికి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాయి. అందరం కలిసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం." అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని... ఏ మార్గాల్లో నిధులు ఇవ్వాలనే అంశంపై చర్చలు జరపనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Eluru Mayor Resigns: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ రాజీనామా
Hyderabad CP: పోలీసులకు హైదరాబాద్ సీపీ వార్నింగ్! ఆ పని చేస్తే ఇక డిస్మిస్!
పోలీసులకు హైదరాబాద్ సీపీ వార్నింగ్! ఆ పని చేస్తే ఇక డిస్మిస్!
Kadapa Accident: కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ లారీ - ఆరుగురు దుర్మరణం!
కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ లారీ - ఆరుగురు దుర్మరణం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Krishna Janmashtami 2024 | అనంతపురంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు |ABP DesamIs mpox the next COVID | Mpox మరో కొవిడ్ కానుందా..? లాక్‌డౌన్ తప్పదా..? | ABP DesamSuryakumar Yadav Leaving MI Fact Check | KKR కి కెప్టెన్ గా SKY వెళ్తున్నాడా..? | ABP DesamVirat Kohli Jersey Auction | విరాట్ కొహ్లీకి ఓ రేట్ కట్టిన అభిమానులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Eluru Mayor Resigns: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ రాజీనామా
Hyderabad CP: పోలీసులకు హైదరాబాద్ సీపీ వార్నింగ్! ఆ పని చేస్తే ఇక డిస్మిస్!
పోలీసులకు హైదరాబాద్ సీపీ వార్నింగ్! ఆ పని చేస్తే ఇక డిస్మిస్!
Kadapa Accident: కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ లారీ - ఆరుగురు దుర్మరణం!
కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ లారీ - ఆరుగురు దుర్మరణం!
Actress Namitha: న‌టి న‌మిత‌కు చేదు అనుభ‌వం.. అప్పుడు గుడి క‌ట్టారు, ఇప్పుడు గుడిలోకే రానివ్వ‌లేదు
న‌టి న‌మిత‌కు చేదు అనుభ‌వం.. అప్పుడు గుడి క‌ట్టారు, ఇప్పుడు గుడిలోకే రానివ్వ‌లేదు
Anna Canteens: ఏపీ వాసులకు గుడ్ న్యూస్ -త్వరలో అందుబాటులోకి మరో 75 అన్నా క్యాంటీన్లు, ముహూర్తం ఫిక్స్
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ -త్వరలో అందుబాటులోకి మరో 75 అన్నా క్యాంటీన్లు, ముహూర్తం ఫిక్స్
Vijayawada Crime: బిర్యానీ కోసం బెజవాడలో హత్య, అన్నను హత్య చేసిన తమ్ముడు!
బిర్యానీ కోసం బెజవాడలో హత్య, అన్నను హత్య చేసిన తమ్ముడు!
Hero Nara Rohit: అందుకే నా జాతకం చెప్ప‌లేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్
అందుకే నా జాతకం చెప్ప‌లేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్
Embed widget