Krishna Devarayalu Resigns: ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు
YSRCP MP Lavu Krishna Devarayalu: వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు...పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.
Lavu Krishnadevarayalu Resigns from YSRCP : వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు...పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా నర్సరావుపేట (Narsaraopet) పార్లమెంట్ సభ్యులు (MP) లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Krishnadevarayalu) వైసీపీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి సైతం గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు... తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో... పోటీ చేసేందుకు నిరాకరించారు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని...గుంటూరుకు మారేది లేదని తెగేసి చెప్పారు. వైసీపీ నర్సరావుపేట టికెట్ ఇవ్వకపోవడంతో...ఆ పార్టీకి రాజీనామా చేశారు.
నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ భావించింది. లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. దీనికి ఆయన అంగీకరించలేదు. రాజకీయంగా కొత్త అనిశ్చితి ఏర్పడిందని, అందుకు తానే బాధ్యుడినని ప్రకటించారు లావు శ్రీకృష్ణదేవరాయలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు...లావు శ్రీకృష్ణదేవరాయలును కలిసేందుకు బయలుదేరారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చవద్దంటూ పల్నాడు జిల్లాకు చెందిన నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డిలు అధిష్ఠానాన్ని కోరారు. గత పది రోజులుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇంతలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు.