అన్వేషించండి

మార్చి నెలాఖరుకు అంబేద్కర్ స్మృతివనం, నాణ్యతలో రాజీ పడొద్దన్న సీఎం జగన్

విగ్రహ పీఠంతో కలుపుకొని అంబేదర్క్‌ విగ్రహం దాదాపు 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని  స్వరాజ్ మైదాన్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ స్మృతివనం, భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు కోసం దాదాపు రూ.268కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాజ్యంగా నిర్మాత విగ్రహం తయారీ, దాని చుట్టూ చేపట్టిన సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానికి ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై  ముఖ్యంత్రి జగన్ అధికారులకో చర్చించారు. అంబేద్కర్ స్మృతివనం పనులపై అధికారులు వివరించగా..సీఎం పలు కీలక సూచనలు చేశారు.

మార్చి నెలాఖరుకు భారీ అంబేద్కర్ విగ్రహం పూర్తి

విగ్రహ పీఠంతో కలుపుకొని అంబేదర్క్‌ విగ్రహం దాదాపు 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు కాగా, పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందన్నారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, 2 వేల మందికి సరిపడేలా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జనవరి 31 నాటికి విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.

నాణ్యత విషయంలో తగ్గొద్దన్న సీఎం జగన్

అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నాణ్యత విషయంలో అస్సలు తగ్గొద్దని, అలాగే నిర్మాణాలు అందంగా ఉండాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.  కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించామని, అలాగే అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్లను సుందరీకరిస్తామని తెలిపిన అధికారులు.

ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ అంబేడ్కర్‌ స్మృతివనం భారతదేశానికే ఒక మణిదీపం అవుతుందని అంబేద్కర్ వాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్మృతివనం పూర్తయితే ప్రపంచ కీర్తి ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget