By: ABP Desam | Updated at : 19 Mar 2022 12:35 PM (IST)
దుర్గమ్మ సన్నిధిలో టెండర్ల గోల్ మాల్ !?
బెజవాడ దుర్గమ్మ ( Durga Temple ) ఆలయంలో టెండర్ల నిర్వహణ పై అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్నాయి. భక్తులు సమర్పించిన చీరల విక్రయాల టెండర్ తో పాటుగా టోల్ గేట్ ( Toll gate ) నిర్వహణ టెండర్లు,సెక్యూరిటి టెండర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించకపోవటం పై కూడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టెండర్ ( Tendars ) పిలిచిన తరువాత షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ , ప్రైజ్ బిడ్ తెరిచిన తరువాత నిబంధనల ప్రకారం టెండర్ కేటాయించాలి. సెక్యూరిటీ టెండర్లకు గత నెల 25న జరిగిన టెండర్లలో తొమ్మిది మంది దాఖలు చేయగా టెక్నికల్ బిడ్ ప్రకారం నలుగురు అర్హత సాధించారు.
నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్ -1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ప్రైస్ బిడ్ ను తెరచి రివర్స్ టెండరింగ్ పిలవగా అందులో ఒకరు అనర్హులయ్యారు. మిగతా ముగ్గురిలో ఒకరికి టెండర్ నిర్ధారించడానికి డాక్యుమెంట్ల పరిశీలన పేరిట రెండు వారాలుగా కాలం గడుపుతున్నారు. అదేమంటే అధికారులు లేరననే సమాధానం చెబుతున్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉండటంతో టెండర్ ఖరారులో జాప్యం జరుగుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో దేవస్థానం అధికారులు చీరల టెండర్ పిలిచారు. ఏడాదికి నాలుగు కోట్ల ఆదాయం వచ్చే చీరల టెండర్‌ను కరోనా సాకుగా చూపించి రూ. మూడు కోట్లకే కట్టబెట్టేశారు. అయితే నిర్వహణ భారం తగ్గిందని అధికా రులు, పాలకమండలి తమ వాదన వినిపించారు.
"పెగాసస్"పై అప్పుడే క్లారిటీ ఇచ్చిన గౌతం సవాంగ్ - ఇప్పుడు వాడేస్తున్న టీడీపీ
టోల్ గేట్ వ్యవహారంలో కూడ గతంలో కాంట్రాక్టర్ దేవస్థానానికి 25 లక్షలు చెల్లించకుండా ఏడాది పాటు భక్తుల నుంచి టోల్ టాక్స్ కింద డబ్బులు వసూలు చేశారు. దేవ స్థానానికి నిర్దిష్ట ఆదాయం వస్తున్నప్పటికి టోల్ వసూళ్ళను కూడా టెండర్ పిలిచేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిబంధనల మేరకే సెక్యూరిటీ టెండర్ ను పిలిచి షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
దేవస్థానానికి బాకీ పడిన కాంట్రాక్టర్లుక నోటీసులు ఇచ్చామని స్పందించమని పక్షంలో బ్లాక్ లిస్టులో పెడతామని వివరణ ఇస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు అందరూ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని.. వారితో పనులు చక్కబెట్టుకుంటూడటంతో అధికారులు ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నారు. ఫలితంగా అమ్మవారి సొమ్ము అక్రమార్కుల పాలవుతోంది
TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?
పల్నాడులో యువతి ప్రాణం తీసిన దిష్టి కొబ్బరి కాయ
TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !
AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !
Minister Meruga Nagarjuna: బీసీ, ఎస్సీలను అణగదొక్కేందుకే టీడీపీ నేతలు అలాంటి వీడియోలు చేయిస్తున్నారు: మంత్రి ఆగ్రహం
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?
Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!