By: ABP Desam | Updated at : 05 May 2023 05:10 PM (IST)
ఓపెన్ నాలలో పడి బాలుడు గల్లంతు
Vijayawada Boy fell into Open Canal: విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆరేళ్ల బాలుడు ఓపెన్ నాలాలో పడి గల్లంతయ్యాడు. మూడు గంటలకు పైగా గాలింపులు చర్యలు చేపట్టగా బాలుడు అభిరామ్ మృతదేహం లభ్యమైంది. ఆయుష్ ఆస్పత్రి సమీపంలో అభిరామ్ డెడ్ బాడీ లభ్యమైంది. బాలుడు చనిపోయినట్లు అధికారులు చెప్పగానే స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శుక్రవారం ఉదయం విజయవాడలో వర్షం కురిసింది. వర్షపు నీటితో పలు కాలనీలు జలమయం అయ్యాయి. అభిరామ్ అనే బాలుడు గల్లంతైన విషయం తెలియగానే కుటుంబసభ్యులు నాలా వద్దకు చేరుకున్నారు. కొడుకు గల్లంతు కావడంతో తండ్రి, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు, రెస్క్యూ టీమ్ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
స్థానిక గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఎసి కళ్యాణ మండపం వెనుక అభిరామ్ అనే బాలుడు ఆడుకుంటున్నాడు. నేటి ఉదయం వర్షం కురవడంతో డ్రైనేజీలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. అయితే సమీపంలో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోయినట్లు తెలుస్తోంది. వర్షపు నీటి ప్రవాహం కారణంగా బాలుడు డ్రైనేజీలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బందికి గురునానక్ కాలనీకి చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుమారుడు నాలలో పడ్డాడని తెలియగానే అక్కడికి చేరుకున్న అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండు గంటలకు పైగా గాలించినా బాలుడి ఆచూకీ తెలియరాలేదు. నాలాలు, డ్రైనేజీలు ఓపెన్ గా ఉంచితే పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శించారు. అధికారులకు పదే పదే చెప్పినా పట్టించుకోని కారణంగా ఓపెన్ నాలాల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోతకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే..
హైదరాబాద్‌లోని కళాసిగూడాలో విషాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 29న పాలకోసం వెళ్లిన నాలుగోతరగతి చదువుతున్న చిన్నారి మౌనికను మురికి కాలవ బలితీసుకుంది. చిన్నపాటి వర్షానికే నాలా పొంగి చిన్నారి ప్రాణం తీసింది. నాలాలో కొట్టుకుపోయిన చిన్నారి పార్క్‌లైన్ వద్ద శవమైతేలింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌లో ఓ చిన్నారిని బలి తీసుకుంది. నాలోలో పడిన నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలిక మృతి చెందింది.
సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో దారుణం జరిగింది. నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలికను నాలా మింగేసింది. ఉదయాన్నే పాల కోసం వెళ్లిన బాలిక కంటికి కనిపించని నీటితో నిండిపోయిన ఉన్న నాలాలో పడిపోయింది.
ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు స్థానికులు, రెండు గంటల పాటు వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంటే... రేపు వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతున్నారని, వేసవికాలంలో వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో పిల్లలతో పాటు పెద్దలకు ఇంకేం రక్షణ ఉంటుందని విమర్శలు వెల్లువెత్తాయి.
NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ
Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?