AP News: దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై దాడి - పోలీసుల అదుపులో నిందితుడు
Vijayawada News: విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Attack on Vijayawada Durga Temple Chairman: విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. ఓ వ్యక్తి గాజు సీసాతో ఆయనపై దాడి చేశాడు. పొట్ట భాగంలో గాయాలు కాగా, ఆయన్ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించగా శ్మశానంలో దీపం పెట్టేందుకు వెళ్లారు. అలా దీపం పెట్టి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో కాటి కాపరి గాజు సీసాతో వెనుక నుంచి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన రాంబాబు, తప్పుకునేందుకు యత్నించగా పొట్ట భాగంలో సీసా దిగి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తి గుంజా కృష్ణగా పోలీసులు గుర్తించి. నిందితున్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే కారణం
కర్నాటి రాంబాబుపై దాడి చేసిన వ్యక్తి కాటి కాపరి గుంజా కృష్ణ అని ఏసీపీ రవింకాంత్ తెలిపారు. రాంబాబు తండ్రి సమాధి శుభ్రం చేసేందుకు ఒకరికి కొంత డబ్బు ఇచ్చారని, తనకు మాత్రం తక్కువ డబ్బులు ఇచ్చారనే కారణంతోనే కృష్ణ దాడి చేసినట్లు తెలిపాడని చెప్పారు. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 T&C Apply