Vijayawada Girls Fight : నడిరోడ్డుపై సిగపట్లు, తగ్గేదేలా అంటూ తన్నుకున్న విద్యార్థినిలు!
Vijayawada Girls Fight : విజయవాడ నడిరోడ్డుపై ఇద్దరు కాలేజీ యువతులు తగ్గేదేలా అన్నట్లు తన్నుకున్నారు. జట్లు పట్టుకుని బాహబాహీకి దిగారు. పక్కనున్న విద్యార్థినిలు వారించినా ఫలితం లేకపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Vijayawada Girls Fight : ఏపీలోని విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జట్టుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై నలుగురు చూస్తుండగానే జుట్టు పట్టుకుని సై అంటే సై అంటూ బాహాబాహీకి దిగారు. విజయవాడ వన్ టైన్ లోని కేబీఎన్ కాలేజీ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గొడవకు కారణాలు తెలియదుగానీ ఆ ఇద్దరు యువతులు మాత్రం పిడిగుద్దులతో ముష్టి యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న స్నేహితులు, ఇతర విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా, తగ్గేదేలా అన్నట్లు తన్నుకున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వైరల్ అయిపోయింది. నడిరోడ్డుపై ఇద్దరు అమ్మాయి ఇలా చితక్కొట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జుట్లు పట్టుకుని మరీ తన్నుకున్న ఇద్దరు అమ్మాయిలను తోటి విద్యార్థినిలు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కారణాలు ఏమిటో?
విజయవాడ వన్ టౌన్ నడిరోడ్డుపై కాలేజీ అమ్మాయిలు రెచ్చిపోయారు. జట్లు పట్టుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కాలేజీ డ్రెస్ లో ఉన్న వీరిద్దరూ రోడ్డుపై విచక్షణ మరిచి జుట్టు పట్టుకుని మరీ చితక్కొట్టుకున్నారు. ఈ ఘటన చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు అవాక్కాయ్యారు. పక్కనే ఉన్న కొంత మంది విద్యార్థులు ఆపేందుకు ప్రయత్నించినా వెనక్కు తగ్గలేదు. విద్యార్థినులు కేబీఎన్ కాలేజీకి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థినుల మధ్య గొడవకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా స్పందించిలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై ఇలా ఎందుకు కొట్టుకున్నారో కారణాలు తెలియలేదు.
అనకాపల్లిలో ఇలాంటి ఘటన
గతంలో.. అనకాపల్లిలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారి కొట్లాటను చాలా మంది వినోదంగా చూశారు. కొంత మంది వీడియో తీశారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. ఓ అబ్బాయి కోసం ఇద్దరూ కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. దీంతో ఆ వీడియోకు ఎక్కడా లేనంత స్కోప్ వచ్చింది. సోషల్ మీడియాలో కలికాలం అని చర్చించుకున్నారు. అనకాపల్లికి చెందిన అ ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకున్నది అబ్బాయి కోసం అని సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. ఎక్కువ మంది అదే నమ్మారు. దీనికి కారణం నిజం ఏమిటో తెలియకపోడం. అసలు నిజం ఏమిటంటే. ఆ ఇద్దరూ కొట్టుకుంది అబ్బాయి కోసం కాదు. ఓ చిన్న మాటగొడవను పట్టుదలకు పోయి అంతకంతకూ పెంచుకోవడంతోనే సమస్య వచ్చింది. అనకాపల్లిలో కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఓ విద్యార్థిని, తమ కాలేజీలోనే చదువుతున్న ఓ కజిన్‌తో కలిసి బస్టాప్‌లో కూర్చుంది. వారిద్దరూ అకడమిక్ విషయంలో మరో కుటుంబపరమైన విషయంలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో యువతి అటుగా వెళ్తున్న సమయంలో యువకుడి కాలు ఆమెకు తగిలింది. ఆ యువతి కావాలనే ఆ యువకులు కాలుతో తాకాడన్న ఉద్దేశంతో గట్టిగా అరిచింది. దాంతో యువకుడితో ఉన్న అమ్మాయి సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. కావాలని తన కజిన్ కాలుతో తాకలేదని చెప్పింది. ఈ విషయంలో గొడవ పెరిగి జట్లు పట్టుకుని తన్నుకున్నారు.