Pawan Chandrababu Meet : ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన టైం వచ్చింది- పవన్ కల్యాణ్
Pawan Chandrababu Meet : ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన టైం వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యం బతికితే ఎన్నికల సంగతి ఆలోచించవచ్చు అన్నారు.
Pawan Chandrababu Meet : విజయవాడలో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. విశాఖ ఘటనపై పవన్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
పవన్ ఏమన్నారంటే
Pawan Chandrababu Meet : "నన్ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న టైంలో చాలా మంది పెద్దలు నాకు మద్దతు తెలిపారు. తెలంగాణ నుంచి జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న, రామకృష్ణ ఇలా చాలా మంది ఫోన్ చేసి మద్దతు తెలిపారు. నాకు మద్దతు తెలిపేందుకు నేరుగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యం బతకాలంటే పార్టీలు ఉండాలి. రాజకీయ పార్టీలు నడిపే వారిని నలిపేస్తామంటే ఎలా? టీడీపీ, వైసీపీ, బీజేపీపై కేసులు పెట్టారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్ఠానానికి లడ్డూలు ఇచ్చి ఇక్కడ ఆ పార్టీ లీడర్లపై కేసులు పెడతారు. అందుకే ఎవరైనా దీన్ని ఎదురించాలి. పార్టీలు నిడిపేవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యల పరిస్థితి ఏంటి. అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటాం. ఇది ఎన్నికల అంశం కాదు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన టైం వచ్చింది. ప్రజాస్వామ్యం బతికితే ఎన్నికల సంగతి ఆలోచించవచ్చు. ఇది ఒక్క రోజులో తేలేది కాదు. భవిష్యత్‌లో ఏం చేయాలో ఇంకా మాట్లాడాల్సి ఉంది." అని పవన్ అన్నారు.
కార్యకర్తల సమావేశంలో పవన్ ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసే విమర్శల డోసును మరింతగా పెంచారు. వైఎస్ఆర్ సీపీ నేతలను ‘‘కొడకల్లారా?, వెధవల్లారా?, సన్నాసుల్లారా?’’ అంటూ పదే పదే ఈ విపరీతమైన పదజాలం వాడుతూ దూషించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తన కాలి చెప్పు పైకి తీసి చూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. ‘చట్ట ప్రకారం విడాకులు ఇచ్చిన వారికి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ.5 కోట్లు ఇచ్చాను. రెండో భార్యకు కూడా నా ఆస్తి రాసిచ్చా. అంతేకానీ, వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరగడం లేద’ని అన్నారు. ‘వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా’ అని తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్ 18) పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
‘‘నాకు రాజకీయం తెలియనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!’’ అంటూ పవన్ కల్యాణ్ మరో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు.