అన్వేషించండి

AP Capital: మూడు రాజధానుల అంశం సరికాదు : కేంద్రమంత్రి అథవాలే

ఏపీలో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదని కేంద్ర మంత్రి అథవాలే అన్నారు. మూడు రాజధానుల అంశం సరికాదని భావించారు. నిధులు లేకే అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే(Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు(Three Capitals) సరికాదని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదన్నారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అథవాలే అన్నారు. నిధులు లేకే అమరావతి(Amaravati) అభివృద్ధి జరగలేదన్నారు. మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని(AP Capital) అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సిందన్నారు. యూపీఏ ప్రభుత్వం(UPA Government) ఈ అంశాలను విస్మరించిందన్నారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలోని కేంద్రం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 

సీఎం జగన్ పాలన గుడ్

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వైసీపీ, బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలపాలని సీఎం కేసీఆర్ ను మరోసారి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Category Status) కోసం సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి వివరించాలని కేంద్ర మంత్రి అథవాలే సూచించారు. కేంద్రం తీసుకోస్తున్న బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు ఇస్తోందన్నారు. సీఎం జగన్‌ పరిపాలన బాగానే చేస్తున్నారన్న ఆయన... ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం తాను ప్రయత్నిస్తానన్నారు. వైఎస్‌ జగన్‌కు ఏపీని పాలించే అవకాశం రావటం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా అథవాలే అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో వివాదాస్పదమైన హిజాబ్‌(Hijab Issue) అంశంపై స్పందించిన అథవాలే హిజాబ్‌ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమన్నారు. విద్యాసంస్థల్లోకి మతం వెళ్లకూడదన్నదన్నారు. పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదన్నారు. 

గతంలోనూ వైసీపీ-బీజేపీ దోస్తీపై కామెంట్స్ 

సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని ఆయన ఎన్డీఏలో చేరాలని గతంలో ఒకసారి రాందాస్ అథవాలే అన్నారు.  ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) పుంజుకునే అవకాశం లేదని అథవాలే జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ(Ysrcp) కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం అయితే  ఏపీ అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. జాతీయ రహదారులు, టూరిజం ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 

Also Read: ఉదయం "హోదా" సాయంత్రానికి తొలగింపు - విభజన సమస్యల చర్చల ఎజెండా మార్చేసిన కేంద్ర హోంశాఖ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
US President News: ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
Embed widget