అన్వేషించండి

Vijayawada News : బెజవాడలో చెత్త డంపింగ్ సమస్య, అజిత్ సింగ్ నగర్ నుంచి యార్డు తరలించారని ప్రతిపక్షాల ఆందోళన

Vijayawada News : విజయవాడలో చెత్త డంపింగ్ సమస్యగా మారింది. స్థానిక అజిత్ సింగ్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డు తరలించాలని స్థానికులు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగారు.

Vijayawada News : విజయవాడలో చెత్త స‌మ‌స్య అజిత్ సింగ్ న‌గ‌ర్ వాసుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గ‌తంలో విజ‌య‌వాడలో సేక‌రించిన చెత్తను డంపింగ్ చేసేందుకు అజిత్ సింగ్ న‌గ‌ర్ వాంబ్వే కాల‌నీ వ‌ద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడే ఎక్సల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ ను వెలికి తీసేందుకు శ్రీ‌రామ్ ఎనర్జీ ప్లాంట్ ను కూడా నెల‌కొల్పారు. అయితే ఆ త‌రువాత ఆ ప్రాజెక్ట్ అట‌కెక్కింది. కాలక్రమంలో చెత్త డంపింగ్ యార్డ్ చుట్టూ ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోయాయి. దీంతో ఇళ్ల మధ్యనే డంపింగ్ యార్డ్ ను తొల‌గించాల‌నే డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. చెత్త డంపింగ్ యార్డ్  నుంచి దుర్వాస‌న రావటంతో పాటు వ‌ర్షాకాలంలో అయితే ప‌రిస్థితి మ‌రి దారుణంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. దోమ‌లు, విష‌పురుగులు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, దీంతో ప్రజలు విష జ్వరాల బారిన‌ప‌డి ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని స్థానికులు అంటున్నారు. 

స్థలం దొరకని పరిస్థితి 

గ‌ర్భిణీ మ‌హిళ‌ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ ను త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయ‌కులు ఆందోళ‌న చేప‌ట్టారు. గ‌తంలో అనేకసార్లు ఆందోళ‌న చేసిన‌ప్పటికీ న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు ప‌ట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడ మ‌రో స‌మ‌స్య కూడా ఉంది. న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు చెత్త డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని వెతికేందుకు ప్రయ‌త్నించినా చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్త డంపింగ్ కు స్థలం దొరకని పరిస్థితి. ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి, డంపింగ్ యార్డ్ నిర్వహించాల‌ని భావించిన‌ప్పటికీ నివాసాల‌కే స్థలాలు లేక‌పోగా ఇక డంపింగ్ యార్డ్ కు స్థలం ఎక్కడ దొరుకుంతుంద‌నే పరిస్థితి ఏర్పడింది. విజ‌య‌వాడ న‌గ‌రానికి చుట్టు ప‌క్కల గ్రామాల్లో అయినా ప్రభుత్వ స్థలాన్ని తీసుకునేందుకు ప్రయ‌త్నించారు. పాత‌పాడులో పంచాయతీ స్థలాన్ని తీసుకొని అక్కడ‌కు న‌గ‌రంలోని చెత్తను త‌ర‌లించేందుకు ప్రయ‌త్నించిన న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌కు స్థానికుల నుంచి వ్యతిరేక‌త వ్యక్తం అయ్యింది. 

ప్రతిపక్షాల ఆందోళన 

విజయవాడ న‌గ‌రపాలక సంస్థ ప‌రిధిలో చెత్తను తీసుకువ‌చ్చి తమ గ్రామంలో వేస్తారా అంటూ పాతపాడుకు చెందిన స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కూడా చెత్త డంపింగ్ కు వీలులేకుండాపోయింది. ఈ నేప‌థ్యంలో అజిత్ సింగ్ న‌గ‌ర్ లోని చెత్త డంపింగ్ యార్డ్ త‌ర‌లింపు స‌మ‌స్య న‌గ‌రపాల‌క సంస్థ అధికారుల‌కు స‌వాల్ గా మారింది. పాల‌కులు మారిన‌ప్పుడ‌ల్లా ప్రతిప‌క్షాలు ఆందోళ‌న చేయ‌టం ప‌రిపాటిగా మారింది. తాజాగా సీపీఐ నాయ‌కులు చెత్త డంపింగ్ యార్డ్ లోని చెత్తను ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ర‌లించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తూ మ‌రోసారి ఆందోళ‌న‌కు దిగారు. పాల‌కులు స్పందించ‌టం లేదని, స్థానిక ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఇంటి ముందే చెత్త వేసి నిర‌స‌న తెలుపుతామంటూ ఆందోళ‌న‌కు దిగిన సీపీఐ నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ కార్యాల‌యం నుంచి ఆందోళ‌న‌కు బ‌య‌లుదేరిన పార్టీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఆందోళ‌న‌ను భ‌గ్నం చేశారు. దీంతో చెత్త త‌ర‌లింపుపై ఆందోళ‌న మ‌రోసారి వాయిదా ప‌డింది. 

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget