వచ్చే ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్న వంగవీటి రాధా
Vangaveeti Radha : విజయవాడ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా పేరున్న వంగవీటి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వంగవీటి మోహన రంగా వారసుడిగా, కాపు సామాజిక వర్గంతో పాటుగా ఇతర కులాల్లో కూడా వంగవీటి రాధాకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ మెదలు కావటంతో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయాలు పై అందరిని ఆకర్షిస్తుంది.
టీడీపీలోనే ఉన్నా యాక్టివ్‌గా లేని వంగవీటి రాధా
గత ఎన్నికలకు ముందు వైసీపీలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారని వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన పోటీ చేసే స్దానం ఏది అనే సందేహం అటు పార్టీ నాయకుల్లో ఇటు వంగవీటి రాధా అనుచరుల్లో కూడా ఉంది. తెలుగు దేశం పార్టీలో కంటిన్యూ అవుతున్న వంగవీటి రాదా రాజకీయ భవితవ్యం పై ఎప్పటికప్పుడు హాట్ ప్రచారాలు జరుగుతునే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఏ స్థానంలో పోటీ చేయాలో .. టీడీపీ హైకమాండ్ కూడా ఆయనకు సంకేతాలుపంపుతున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంట్‌కు పోటీ చేయించాలని టీడీపీ ప్రయత్నం
వంగవీటి రాధాకృష్ణను ఎంపీగా పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతుననారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు. వంగవీటి రాధా కు విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఫాలోయింగ్ ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా ఇష్టపడే వారు. అయితే అక్కడ తెలుగు దేశం నుండి బోండా ఉమా ఇప్పటికే పాతుకుపోయారు. ఆయన్ను కాదని వంగవీటి రాధాను పోటీకి దింపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వంగవీటి రాధా కు కూడా బోండా ఉమా ను కాదని పోటీచేసే ఆలోచన లేదని అంటున్నారు. ఇక విజయవాడ లోని తూర్పు నియోజకవర్గంలో ఇదే పరిస్దితి ఉంది. అయితే తూర్పు లో పోటీ చేసేందుకు రాధా గతంలోనే విముఖుత వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమంలో ఇప్పటికే జనసేనకు ఎక్కువ ప్రాథాన్యత ఇవ్వటంతో పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు వెళ్తుందని భావిస్తున్నారు.
పార్లమెంట్‌కు పోటీ చేసే చాన్స్
మచిలీపట్టణం పార్లమెంట్ స్దానం నుంచి వంగవీటి రాధాను పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోరగా అక్కడ మల్లాది విష్ణు ఉండటంతో జగన్ అందుకు అంగీకరించ లేదు. దీంతో మచిలీపట్టణం పార్లమెంట్ స్దానం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధకు అప్పట్లోనే జగన్ ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రాధా ససేమిరా అన్నారని చెబుతారు. అదే సమయంలో రాధాకు పార్టీ నుండి సహయ నిరాకరణకు గురికావటం తో పార్టిలో ఇమడలేక బయటకు వస్తున్నట్లుగా రాధా ప్రకటించారు. ఇది సంచలనం అయ్యింది. అప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం రాధాను తమ పార్టీలోకి చేర్చుకోవడంలో తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు.
పోటీ చేయడానికి అడిగిన సీటు ఇవ్వకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాలు చాలా కాలంగా జరుగుతున్నాయి.
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేత
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Chandrababu Naidu Arrest : మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
Aditya L1: ఇస్రో కీలక అప్డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
/body>