అన్వేషించండి

Vande Bharat Express: తిరుపతి వెళ్లే వాళ్లు ఈ వార్త చదివితే ఎగిరి గంతేస్తారు? మరింత వేగంగా శ్రీవారి దర్శన భాగ్యం

Vande Bharat Express: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మధ్య వందే భారత్ రైల్‌ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. వచ్చేనెలలో ఈ రైలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

Vande Bharat Express: భారత్‌ రైల్వే చరిత్రలోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చాలా ప్రత్యేకమైంది. అతి తక్కవ కాలంలోనే గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇప్పుడు ఈ ట్రైన్ బాగా పనికొస్తుంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసింది వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇప్పుడు మరో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది.  

సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ఈ రైలు నడపనున్నట్టు ఇదివరకు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ రైలును వెంకటేశ్వర స్వామి భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

త్వరలోనే ఈ ట్రైన్ ఈ రెండు సిటీల మధ్య దూసుళ్లనుంది. దీనికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక రైల్వే అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సందేశం వచ్చింది. గురువారం రోజు రాత్రి అన్ని విభాగాలను ఆదింశించారట. వచ్చే నెల మొదటి వారంలోనే దీన్ని తిరుపతి, హైదరాబాద్ మధ్య నడపాలని భావిస్తున్నారని సమాచారం. 

వారంలో ఆరు రోజుల మాత్రమే ఈ ట్రైన్ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన రూట్‌, ఏ స్టేషన్లలో ఆగుతుంది... టికెట్ ఎంత అనే వివరాాలను వచ్చే వారంలో ప్రకటించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి వేల మంది తిరుపతి స్వామివారిని దర్శించుకుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండే హైదరాబాద్‌ నుంచి రోజు వేల మంది తిరుపతి దర్శనానికి వెళ్తుంటారు.

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దేవుని దర్శనాని కంటే ముందు ప్రయాణమే పెద్ద అగ్ని పరీక్షలా ఉంటుంది. టికెట్‌ బుకింగ్ నుంచే వారి సహనానికి పరీక్ష మొదలవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుంటే మాత్రం తిరుపతికి టికెట్ దొరకడం చాలా సమస్య అందుకే ఇప్పుడు వందేభారత్‌ రాకతో ఆ సమస్య తీరిపోనుందని నగరవాసులు అంచనా వేసుకుంటున్నారు. ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్ నగర్-కర్నూల్, వికారాబాద్-తాండూర్-రాయచూర్.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూర్ మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఏయే స్టేషన్లలో ఈ వందేభారత్ రైలు ఆగుతుంది, ఛార్జీలు ఎంత, ఇక్కడి నుంచి తిరుపతి చేరడానికి ఎంత సమయం పడుతుంది వంటి వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. 

విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ కు ధరలివే..!

టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ నడుస్తున్న షెడ్యూల్‌ను బట్టి అందించే ఫుడ్‌లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం ఇచ్చే ఫుడ్ వేరు. రాత్రి ఇచ్చే ఆహారం వేరు. అందుకే టికెట్ ధరల్లో తేడా కనిపిస్తోంది.

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (SC - VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20834

నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
సికింద్రాబాద్          వరంగల్                   రూ.520                    రూ.1,005
సికింద్రాబాద్           ఖమ్మం                    రూ.750                    రూ.1,460
సికింద్రాబాద్        విజయవాడ                  రూ.905                    రూ.1,775
సికింద్రాబాద్      రాజమహేంద్రవరం           రూ.1365                  రూ.2,485
సికింద్రాబాద్‌         విశాఖపట్నం               రూ.1665                   రూ.3,120

* విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ (VSKP - SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833 

నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
విశాఖపట్నం     రాజమహేంద్రవరం           రూ.625                        రూ.1,215
విశాఖపట్నం          విజయవాడ               రూ.960                        రూ.1,825
విశాఖపట్నం             ఖమ్మం                 రూ.1,115                     రూ.2,130
విశాఖపట్నం            వరంగల్‌                రూ.1,310                     రూ.2,540
విశాఖపట్నం         సికింద్రాబాద్              రూ.1720                       రూ.3,170

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget