అన్వేషించండి

UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

UDID Card Apply Online: దివ్యాంగులకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కార్డు యూడీఐడీ కార్డు. అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు, రాయితీలకు ఇది సింగిల్ కార్డుగా ఉపయోగపడుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దివ్యాంగుల సేవలకు UDID కార్డు, 40% వైకల్యం తప్పనిసరి.
  • swavlambancard.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • మెడికల్ బోర్డు ఆమోదిస్తే కార్డు లభిస్తుంది, అనేక ప్రభుత్వ ప్రయోజనాలు.

UDID Card Apply Online: దివ్యాంగులకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు, సేవలు సులభంగా అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశిష్ట గుర్తింపు కార్డే UDID Card (Unique Disability ID). దీనిని సాధారణంగా యూడీఐడీ కార్డు అని పిలుస్తారు. ఈ కార్డుకు సంబంధించిన అర్హతలు, ప్రయోజనాలు, ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

UDID కార్డు అంటే ఏమిటి?

దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమాచారాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కార్డు ఉంటే ఇకపై ప్రతిచోటా వేర్వేరు సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క కార్డుతోనే దేశంలో ఎక్కడైనా దివ్యాంగులకు సంబంధించిన సేవలు పొందవచ్చు.

కార్డు పొందేందుకు అర్హతలు   

కనీసం 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించాలి.

అంధత్వం, పాక్షిక అంధత్వం, మూగ, వినికిడి లోపం, కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, మానసిక వైకల్యం, కుష్టు వ్యాధి తగ్గిన వారు, అటిజం, సెరిబ్రల్ పాల్సి, యాసిడ్ దాడి బాధితులు, కండరాల క్షీణత, వంటి 21 రకాల లోపాలు ఉన్నవారు దీనికి అర్హులు.

కావాల్సిన పత్రాలు  

  1. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి కొన్ని పత్రాలు అవసరం 
  2. ఇటీవల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో  
  3. సంతకం లేదా బొటనవేలు ముద్ర  
  4. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా విద్యుత్ బిల్లు
  5. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ ఐడెంటిటీ ఫ్రూప్ కోసం 
  6. సదరమ్ సర్టిఫికేట్  

Also Read:  

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి?  

మీరు మీ మొబైల్ లేదా లాప్‌టాప్ ద్వారా స్వయంగా లేదా దగ్గరలోని మీ సేవ, సీఎస్‌సీ సెంటర్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.swavlambancard.gov.in ఓపెన్ చేయండి.

Step 2: హోమ్‌పేజీలో ఉన్న "Apply for Disability Certificate & UDID Card" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Step 3: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో 4 పార్ట్స్ ఉంటాయి.

  • వ్యక్తిగత వివరాలు: మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు 
  • మీ వైకల్యానికి సంబంధించిన వివరాలు  
  • మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా నిరుద్యోగులా అనే వివరాలు 
  • ఐడెంటిటీ కోసం.. ఆధార్ నెంబర్, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 4: వివరాలు నింపిన తర్వాత, పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.

Step 5: సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై ఒక Enrolment Number వస్తుంది. దీన్ని ప్రింట్ లేదా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి.   

Also Read: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

 కార్డు ఎప్పుడు, ఎలా వస్తుంది?

  • మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, ఆ వివరాలు మీ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ బోర్డుకు వెళ్తాయి.
  • ఒకవేళ మీ దగ్గర పాత సర్టిఫికెట్ లేకపోతే, మిమ్మల్ని  ప్రభుత్వ ఆసుపత్రికి పిలిచి పరీక్షలు చేస్తారు.
  • మెడికల్ బోర్డు మీ వివరాలను వెరిఫై చేసి ఆమోదించిన తర్వాత, వెబ్‌సైట్ నుండి మీ డిజిటల్ UDID కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఒరిజినల్ ప్లాస్టిక్ స్మార్ట్ కార్డు మీ ఇంటి అడ్రస్‌కు పోస్ట్ ద్వారా ఉచితంగా పంపిస్తారు.

 UDID కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు

  • ప్రభుత్వ పథకాలు, రాయితీల కోసం వేర్వేరు సర్టిఫికెట్లు చూపించాల్సిన పనిలేదు. ఈ ఒక్క కార్డు సరిపోతుంది.
  • ఆర్టీసీ బస్సులు, రైల్వే ప్రయాణాల్లో రాయితీ పొందడానికి ఇది ఉపయోగపడుతుంది.
  • వికలాంగుల పింఛన్, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు ఇది ముఖ్యం
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్ పొందడానికి సులభం అవుతుంది.
  • ప్రభుత్వం అందించే ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, జైపూర్ కాళ్లు వంటి సహాయక పరికరాల పంపిణీలో ఈ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

Also Read: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!

Frequently Asked Questions

యూడీఐడీ కార్డు అంటే ఏమిటి?

యూడీఐడీ కార్డు (Unique Disability ID) అనేది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే విశిష్ట గుర్తింపు కార్డు. ఇది ప్రభుత్వ పథకాలు, సేవలను సులభంగా పొందేందుకు సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా దివ్యాంగుల సమాచారాన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువస్తుంది.

యూడీఐడీ కార్డు పొందడానికి అర్హులు ఎవరు?

కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించిన దివ్యాంగులు ఈ కార్డుకు అర్హులు. అంధత్వం, వినికిడి లోపం, మానసిక వైకల్యం వంటి 21 రకాల లోపాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

యూడీఐడీ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

www.swavlambancard.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి

యూడీఐడీ కార్డుకు దరఖాస్తు చేయడానికి ఏ పత్రాలు అవసరం?

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం లేదా బొటనవేలు ముద్ర, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, సదరమ్ సర్టిఫికేట్ వంటివి అవసరం.

యూడీఐడీ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చు. ఆర్టీసీ, రైల్వే ప్రయాణాల్లో రాయితీలు, వికలాంగుల పింఛన్, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు, విద్యాసంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
Somireddy Chandramohan Reddy: ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
శరన్నవరాత్రి Day 2: గాయత్రీ దేవిగా దుర్గమ్మ! వేదమాత విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి! ఇంద్రకీలాద్రి 2026
శరన్నవరాత్రి Day 2: గాయత్రీ దేవిగా దుర్గమ్మ! వేదమాత విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి! ఇంద్రకీలాద్రి 2026

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget