News
News
X

TTD Ramana Dikshitulu: ఆ అర్చకులకు సంభావన ఇవ్వడంలేదు... గర్భగుడిలో పూజలు చేయనీయడంలేదు... సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్

ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మళ్లీ వార్తల్లో నిలిచారు. అధికారుల తీరుపై అసహనంగా ఉన్న ఆయన సీఎం జగన్ టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

FOLLOW US: 
 
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్‌ చర్చనీయాంశం అయ్యింది. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన అర్చకులను సంభావన ఇవ్వడంలేదని ఆయన అన్నారు. తిరుచానూరు పద్మావతి ఆలయంలోని వంశపారపర్య అర్చకులకు సంభావన ఇవ్వలేదన్నారు. టీటీడీ అధికారుల వల్ల 2018 నుంచి కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేశామన్నారు. ఇంత కష్టపడినా తమను గర్భగుడిలో పూజా కార్యక్రమాలు చేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అర్చకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను ట్విటర్‌ ద్వారా కోరారు. 

Also Read:  వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?

News Reels

మళ్లీ విధుల్లోకి

మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను టీటీడీ తిరిగి విధుల్లోకి తీసుకుంటుంది. ఈ నిబంధనలతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా బాధ్యతులు చేపట్టారు. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అప్పట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ తమ విధుల నుంచి తప్పుకున్నారు. వీరిలో రమణ దీక్షితులతో పాటు 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది ఉన్నారు. 

Also Read: కల నెరవేరదూ.. ట్వీట్లు ఆగవు.. మళ్లీ లైమ్ లైట్ లోకి రమణ దీక్షితులు

ప్రభుత్వంపై విమర్శలు

టీటీడీ నిర్ణయంతో ఎ.వి.రమణ దీక్షితులతో పాటు  మరో 14 మంది తిరిగి అర్చకులుగా చేరేందుకు అవకాశం లభించింది. రమణదీక్షితులు వంశపారంపర్య అర్చకులు. ఆయనకు రిటైర్మెంట్ ఉండేది కాదు. గత పాలకమండలి తీర్మానం వలన ఆయన రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రమణదీక్షితులు రాజకీయ విమర్శలు చేయడమే అనే వార్తలు వచ్చాయి.  ప్రధాన అర్చుకుడిగా ఉంటూనే 2018 మేలో  చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. పోటులో తవ్వకాలు నిర్వహించారని, పింక్ డైమండ్‌ను విదేశాలకు తరలించారని ఇలా అనేకానేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల కారణంగా టీటీడీ ఆయనపై రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ తరవాత రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన విధులకు దూరమయ్యారు. 

Also Read: టీడీపీని జనసేనలో విలీనం చేయండి... పవన్ ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారు... చంద్రబాబు, పవన్ పై కొడాలి నాని కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Oct 2021 04:34 PM (IST) Tags: AP Latest news TTD News Tirumala news tirumala latest news Ramana dikshitulu

సంబంధిత కథనాలు

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

నెల్లూరులో ఇదేం ఖర్మ-ఆ ఎమ్మెల్యే కమల్ హాసన్ కంటే గొప్ప నటుడా?

నెల్లూరులో ఇదేం ఖర్మ-ఆ ఎమ్మెల్యే కమల్ హాసన్ కంటే గొప్ప నటుడా?

Two States Poitics : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక ! "దత్తత" రాజకీయం వర్కవుట్ అవుతోందా ?

Two States Poitics  : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక !

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

టాప్ స్టోరీస్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Neelima Guna Wedding : గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ మ్యారేజ్ రిసెప్షన్ - నూతన వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్, తలసాని  

Neelima Guna Wedding : గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ మ్యారేజ్ రిసెప్షన్ - నూతన వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్, తలసాని  

AP Politics : ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

AP Politics :  ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!