Top Headlines Today: చంద్రబాబు మరో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
Top 5 Telugu Headlines Today 18 October 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 18 October 2023:
చంద్రబాబు మరో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - మళ్లీ నవంబర్ 7న !
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్ 7కు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ పొడిగించినట్లయింది. విచారణ సమయంలో.. సుప్రీంకోర్టులో 17ఏ సెక్షన్ వర్తింపుపై తీర్పు రానుందని.. అందులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే..ఈ కేసుకు కూడా వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ విచారణపై గతంలో హైకోర్టు స్టే విధించింది. ఏసీబీ కోర్టులో విచారణపై స్టేను నవంబర్ 7 వరకు హైకోర్టు పొడిగించింది. పూర్తి వివరాలు
పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ - కలిసి పోటీ చేయబోతున్నారా ?
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తూనే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భగంగానే జనసేన మద్దతు కోరారు. పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది. అయితే హఠాత్తుగా పోటీపై వెనక్కి తగ్గవద్దని పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ నాయకులు కోరినట్లుగా .. జనసేననే ప్రకటించింది. పూర్తి వివరాలు
మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మంత్రి రోజాపై బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బేషరత్తుగా రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సామజిక వర్గం నేతలు మంత్రి రోజాపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ బుడబుక్కల సంఘం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం డిమాండ్ చేశారు. మంత్రి రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు
కేసీఆర్‌పై పోటీ చేసేది ఎవరు ? - విజయశాంతి డిమాండ్ లాంటి విజ్ఞప్తులు
తెలంగాణ బిజేపీ తొలి జాబితా విడుదల కావడానికి రంగం సిద్ధమైన సమయంలో విజయశాంతి కొత్త ప్రతి పాదనలను తెర ముందుకు తీసుకు వచ్చారు. విజయశాంతి పేరు పెద్ద ప్రచారంలోకి రావడం లేదు. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కేసీఆర్ పై పోటీకి తన పేరు పరిశీలించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే తనతో పాటు బండి సంజయ్ టిక్కెట్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని గజ్వేల్ లో బండి సంజయ్ కు... కామారెడ్డిలో తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె విజ్ఞాపన. అయితే ఇది తన మాటగా కాకుండా. కార్యకర్తలు అలా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు





















