Top Headlines Today: సీఎం జగన్‌ను బాలకృష్ణ టార్గెట్ చేశారా? - ప్రవళిక మృతిపై నివేదికకు గవర్నర్ తమిళిసై ఆదేశాలు
Top 5 Telugu Headlines Today 14 October 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 14 October 2023:
ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ లో గ్రూప్ - 2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించారు. నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని తమిళిసై కోరారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్ - 2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. పూర్తి వివరాలు
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో చంద్రబాబు మద్దతుదారుల మెట్రో ప్రయాణం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీలోనే కాదు హైదరాబాద్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ర్యాలీ, ధర్నాలు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నల్ల టీషర్టులు ధరించి మెట్రో ట్రైన్‌లో ప్రయాణించారు. దీంతో హైదరాబాద్ మెట్రో స్టేషన్ల దగ్గర హైఅలర్ట్ కొనసాగుతోంది. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో చేపట్టే ఆందోళనకు మద్ధతుగా భారీగా టీడీపీ శ్రేణులు మద్దతుదారులు రావడంతో హైదరాబాద్‌లోని చాలా మెట్రో స్టేషన్‌లలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా మియాపూర్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులే ఏర్పాడ్డాయి. పూర్తి వివరాలు
జనగామలో బీఆర్‌ఎస్ కొత్త ట్విస్ట్, పొన్నాల టికెట్ ఖాయమేనా ?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిని మార్చేస్తుందా ? సిట్టింగ్ ఎమ్మెల్యే మత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సీటు త్యాగం చేసినందుకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతులు కలిపారు. పల్లా విజయం కోసం పని చేస్తానని, పార్టీ గెలుపే తన లక్ష్యమని ప్రకటించాడు. పల్లా, ముత్తిరెడ్డి చేతులు కలిపారు. ఆలింగనాలు చేసుకున్నారు. పూర్తి వివరాలు
అన్‌స్టాపబుల్ ప్రోమోలో పేలిన బాలయ్య డైలాగ్స్! జగన్‌నే బాలకృష్ణ టార్గెట్ చేశారా?
" సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". ఇదేదో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి మూవీలోని డైలాగ్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవర్ని ఉద్దేశించి ఇంత ఘాటైన, పదునైన వ్యాఖ్యలు చేశారంటూ జనం చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంటర్‌టైనింగ్ టాక్ షో ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ లోని డైలాగ్ ఇది. పూర్తి వివరాలు
నిజామాబాద్ జిల్లాలో నెగ్గేదెవరు- బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను కమలం ఎదుర్కోగలదా?
నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాదు రూరల్, బాల్కొండ. ఈ ఐదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటాగా తలబడుతున్నాయి. బీజేపీ కూడా ముందుకు దూసుకొచ్చింది. దీంతో నిజామాబాద్ జిల్లా త్రిముఖ పోరు తప్పేట్టు లేదు. ఆర్మూరు నియోజకవర్గం... నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పసుపు రైతులు ఇక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పూర్తి వివరాలు





















