అన్వేషించండి

Unstoppable With NBK:అన్‌స్టాపబుల్‌ ప్రోమోలో పేలిన బాలయ్య డైలాగ్స్! జగన్‌నే బాలకృష్ణ టార్గెట్ చేశారా?

బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరించిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

" సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". ఇదేదో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి మూవీలోని డైలాగ్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఎవర్ని ఉద్దేశించి ఇంత ఘాటైన, పదునైన వ్యాఖ్యలు చేశారంటూ జనం చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంటర్‌టైనింగ్‌ టాక్‌ షో ఎన్‌బీకే విత్‌ అన్‌స్టాపబుల్‌ లోని డైలాగ్ ఇది. 

భగవంత్‌ కేసరి టీం సందడి
బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరించిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి ఎపిసోడ్ లో భగవంత్‌ కేసరి చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్‌స్టాపబుల్‌లో అతిథులుగా వచ్చిన భగవంత్‌ కేసరి టీమ్‌ను బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. తన మాటలతో, ఛలోక్తులతో నవ్వులు పూయించారు. ప్రోమో చివరిలో బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులతో చేత విజిల్స్ కొట్టించాయి. 

షో ప్రారంభంలోనే చెప్పేశారా ?
"మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు " అంటూ ప్రొమో ప్రారంభంలోనే  బాలకృష్ణ  అదిరిపోయే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పేల్చారు. బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేశారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.  35 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోల్చుతూ డైలాగ్ వేశారని అంటున్నారు. 

జగనే విలన్ ? చంద్రబాబు హీరో ?
" సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". రాష్ట్రం బాగునప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి, మొత్తం నాశనం చేశారని డైలాగ్ లతోనే సెటైర్లు వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని, దాన్ని మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలన్నారు. అంటే ఇక్కడ హీరో చంద్రబాబు అని,  జైలు నుంచి బయటకు వస్తే అంతా సెట్ చేస్తారంటూ కామెంట్ చేశారు.  

డైలాగ్స్ సూపర్
ప్రొమోలో భగవంత్ కేసరి టీం సందడి చేసిన దాని కంటే, బాలకృష్ణ ఏపీలోనే పరిస్థితులపై పేల్చిన పంచ్ డైలాగ్ లు అదిరిపోయాయని ప్రశంసలు కురిపిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనను, సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారని అంటున్నారు. మొత్తంగా ప్రోమోలో ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ...బాలకృష్ణ హైలెట్ అయ్యారని అందులోనూ జగన్మోహన్ రెడ్డిను టార్గెట్ చేస్తూ పేల్చిన డైలాగ్స్ హైలెట్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అక్టోబరు 17న ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Murder Case: లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
Breaking News: రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Embed widget