Top Headlines Today: కాంతితో క్రాంతి పేరుతో ఆందోళనకు టీడీపీ నిర్ణయం - బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏమీ లేదని ప్రజలు నమ్ముతారా ?
Top 5 Telugu Headlines Today 06 October 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 06 October 2023:
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ మరో ఆందోళన- కాంతితో క్రాంతి పేరుతో నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వరుసగా ఆందోళనలు చేస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలతో వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. ‘కాంతితో క్రాంతి’ పేరిట కార్యక్రమం నిర్వహిద్దామని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామన్నారు. పూర్తి వివరాలు
కేసీఆర్‌పై విమర్శలు, తెలంగాణకు కొత్త వరాలు - ఇప్పుడైనా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏమీ లేదని ప్రజలు నమ్ముతారా ?
బీజేపీ , బీఆర్ఎస్ మధ్య ఏదో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకని బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పదాధికారుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతూండటం.. ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉండటమే. అయితే ఇటీవల ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రధాని మోదీ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణకు వరాలు ప్రకటించారు మరి ఇప్పుడైనా తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి అని ప్రజలు నమ్ముతారా? పూర్తి వివరాలు
తెలంగాణలోని 27,147 బడుల్లో అల్పాహార పథకం- నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం
తెలంగాణలో విద్యార్థల కోసం మరో సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు, వారి దృష్టి చదువుపై మరింత ఫోకస్డ్‌గా ఉండేలా అల్పాహారం అందిస్తోంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పేరుతో ఈ పథకాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో పథకాన్ని స్టార్ట్ చేశారు. పూర్తి వివరాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొత్త కోణం, ఎన్నికల బాండ్ల చుట్టూ ఏపీ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల బాండ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 27 కోట్ల రూపాయలు, ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీన్నే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశ పెడుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సందర్భంగా వాదించిన సీఐడీ తరఫు లాయర్లు ఎన్నికల బాండ్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వివాదం సరికొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. పూర్తి వివరాలు
రాజమండ్రికి లోకేష్, మాజీ మంత్రులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవనున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంపై అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేశ్.. గురువారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(శుక్రవారం) ఉదయం ఉండవల్లి నివాసం నుంచి నారా లోకేశ్.. రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరానికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. పూర్తి వివరాలు