Top Headlines: ఏపీలో నామినేటెడ్ పదవుల పండుగ - ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్
Top News: ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Telugu States:
1. ఏపీలో 20 నామినేటెడ్ పదవులతో తొలి జాబితా విడుదల
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ ఈ పదవులు దక్కాయి. ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు. వీటి భర్తీలో కూడా కూటమి నేతలపై ఎంతో ఒత్తిడి ఉంది. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంకా చదవండి.
2. టికెట్లు త్యాగం చేసిన వారికి ఎదురొచ్చిన పదవులు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇరవై కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు, ఇందులో అత్యధిక మంది టిక్కెట్లు త్యాగం చేయడమే కాదు పార్టీ కోసం కష్టపడి పని చేశారు. వారందరికీ చంద్రాబబు గుర్తింపు ఇచ్చారు. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ 2019లో అదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి హ్యాండివడంతో చివరి క్షణంలో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో కోటంరెడ్డి పార్టీలోకి రావడంతో ఆయనకే టిక్కెట్ కేటాయించారు. ఇంకా చదవండి.
3. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హీరో కార్తీ క్షమాపణలు
తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ టాపిక్ వచ్చినప్పుడు 'అది సెన్సిటివ్ ఇష్యూ' అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి.
4. మండల స్థాయిలోనే జనం సమస్యలకు పరిష్కారం
బీఆర్ఎస్ హయాంలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లలో గ్రీవెన్స్ డే నిర్వహించేవారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజావాణి పేరుతో అర్జీలు స్వీకరిస్తున్నారు. తొలినాళ్లలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ ప్రచారం కల్పించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లలో యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రీవెన్స్ డే పేరు మారింది కానీ, ప్రజావాణి వల్ల ఉపయోగం ఎంతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందుకే దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం మరింత పకడ్బంధీగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇంకా చదవండి.
5. హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్ కలకలం
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఉదయం ఐదు గంటల నుంచి ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌ని ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. బొల్లా రామకృష్ణ న్యూస్ ఛానల్‌తోపాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా చదవండి.