అన్వేషించండి

Actor Karthi: తిరుమల లడ్డూ వివాదం... పవన్‌కు క్షమాపణలు చెప్పిన కార్తీ - అపార్థం చేసుకోవద్దంటూ ట్వీట్

లడ్డూ గురించి తాను చేసిన కామెంట్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని తమిళ నటుడు కార్తీ కోరారు. తన మాటలను దయచేసి అపార్థం చేసుకోవద్దంటూ పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

Karthi Apologizes To Pawan Kalyan: తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ టాపిక్ వచ్చినప్పుడు 'అది సెన్సిటివ్ ఇష్యూ' అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కార్తి స్పందించారు. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచనలేదని, ఒకవేళ ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించాలని కార్తీ కోరారు. “డియర్ పవన్ కల్యాణ్ సర్.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నాను. నేను శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తుడిని. మన సంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను” అని వివరణ ఇచ్చారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో తాజాగా ‘సత్యం సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. సూర్య దంపతులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో కార్తీని యాంకర్ మంజూష “లడ్డూ కావాలా నాయనా?” అని అడగడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. “ప్రస్తుతం లడ్డూ టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లడ్డూ టాపిక్ సెన్సిటివ్ గా మారింది. ఇలాంటి సమయంలో దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్” అన్నారు.

కార్తీ కామెంట్స్ పై పవర్ స్టార్ ఆగ్రహం

కార్తీ లడ్డూ గురించి చేసిన కామెంట్స్ పై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఏదైనా మాట్లాడే ముందుకు ఒకటికి వందసార్లు ఆలోచించాలన్నారు. “లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి ఇలా అనకండి. ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి” అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హీరో కార్తి స్పందించారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం కార్తీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం పంథాలకు పోకుండా కార్తీ క్షమాపణలు చెప్పడం మంచి విషయం అంటున్నారు నెటిజన్లు. అందుకే, కార్తీని తెలుగు సినీ అభిమానులు అంతగా ఇష్టపడుతారుని కామెంట్స్ పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Belikekick (@belikekick)

Read Also: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Embed widget