Today Top Headlines తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ధరణి పోర్టల్ ఇక నుంచి 'భూమాత', శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి
Top Five Headlines: ఏపీ, తెలంగాణలో శుక్రవారం జరిగిన టాప్ 5 ముఖ్య వార్తలు మీ కోసం. ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Top Five Headlines In AP And Telangana:
1. తెలంగాణ క్రీడాకారులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్
హర్యానా, పంజాబ్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి... క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపట్టే చర్యలను వివరించారు. హర్యానా, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టే మంచి చర్యలపై కచ్చితంగా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా చదవండి.
2. 'ధరణి' పోర్టల్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ధరణీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ...ధరణీ చట్టం మూడు తలలతో మొదలై.. 33 తలలతో అవతరించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సమయంలో ఎక్కడికి వెళ్లినా ధరణీ సమస్యల గురించే ప్రజలు ఆయనకు వివరించారన్నారు. ధరణీని బంగాళఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. ఇంకా చదవండి.
3. స్కిల్ వర్శిటీలో తొలి ఏడాది 2 వేల మందికి ట్రైనింగ్
తెలంగాణ యువతలో నైపుణ్యాల కల్పనకు ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల్లో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి ఆగస్టు 1న ఈ మేరకు శంకుస్థాపన చేశారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు. కొత్త విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటివరకు ఆగకుండా ఈ ఏడాది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)లో ఆరు కోర్సులతో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1న శాసనసభలో ప్రకటించారు. ఇంకా చదవండి.
4. సీఎం చంద్రబాబుపై పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అభినందించారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి రఘువరన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లకుండా ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాగే రాజకీయ పార్టీ నేతలు కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకా చదవండి.
5. శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి
శ్రీశైలం ఆలయంలో (Srisailam Temple) ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడం కలకలం రేపింది. గురువారం రాత్రి 9 గంటలకు ఆలయంలోని క్యూ కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగిని గుర్తించిన భక్తులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కొందరు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆలయంలో అపచారం జరిగిందని.. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి.