Andhra Pradesh: పుంగనూర్ భూమి వివాదంపై ప్రాథమిక నివేదిక సిద్ధం- తర్వాత ఏంటీ?
Chittoor News: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 22 లోని సుమారు 982.48 ఎకరాల భూమి ని పెద్దిరెడ్డి తన అనుచరుల పేరు తో మార్చారని విజిలెన్సు ప్రాధమిక నివేదిక.
YSRCP Peddireddy Ram Chandra Reddy: అది వ్యవసాయానికి పనికి రాని భూమి.. అక్కడ పిచ్చి మొక్కలు తప్ప మరేమీ వచ్చే పరిస్థితి లేదు.. వర్షాలు లేక అక్కడ ఉండే జంతువులకు సైతం నీరు లేదు..ఆ చుట్టు పక్కల ఉన్న గ్రామాలు సైతం గోవులను ఆ ప్రాంతంలోకి తీసుకురారు. అలాంటి అడవి ప్రాంతంలో వ్యవసాయం రైతులకు ఏకంగా 982.48 ఎకరాలు ప్రభుత్వ అధికారులు అప్పగించారు.
అసలు కదా ఏంటి..!
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 22లోని సుమారు 982.48 ఎకరాల భూమి ఉంది. ఇది సాగు భూమి కాదు. 1907లో అప్పటి జమీందార్ మహదేవరాయులు పేరు పైన ఉండేది. 1948లో వచ్చిన ఎస్టేట్ రద్దు చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై అంత భూమి ఉండకూడదని చట్టం ప్రకారం దానిని ప్రభుత్వం విలీనం చేసుకుంది. ఆ భూమి తమ భూమి తమకు అప్పగించాలని 1958లో జమీందార్ మహదేవరాయులు కొడుకు శంకర్ రాయల్ అప్పటి అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించి 1958 ఫిబ్రవరి 20న రఫ్ (చిత్తు) పట్టాను అప్పటి అధికారులు మంజూరు చేశారు. ఆ తరువాత 1977లో శంకర్ రాయల్ కు ఇచ్చిన రఫ్ పట్టాను ప్రభుత్వం రద్దు చేసి.. అటవీ భూమి గా మార్పు చేశారు. నాటి నుంచి 2022 వరకు అది అడవీ భూమి గా ఉండేది.
ఏమి జరిగింది..!
2019లో వైసీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అప్పట్లో పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 2022 సమయంలో అధికారులు మంత్రి ఇలాకాలో 1978 నుంచి అటవీ భూమిగా ఉన్న 982.48 ఎకరాలు వ్యవసాయం చేసే రైతుల పేరుతో మారిపోయింది. ఇక్కడ నేటికి ఎలాంటి వ్యవసాయం కాదు... ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సైతం మార్గం లేదు. పైగా ఆ ప్రాంతంలోకి ఎవరు రాకుండా చుట్టూ ట్రెంచ్ వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ భూమి విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. దీనిపై విజిలెన్స్ విచారణ కు ఆదేశించారు.
ప్రాథమిక నివేదిక
రాగానిపల్లి పంచాయితీ పరిధిలోని అడవి భూమిపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో కూడా విచారణ సైతం జరుగుతుంది. ఈ తరుణంలో అప్పటి సబ్ కలెక్టర్ మదనపల్లిలో ఉండేది. ఈ భూముల విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం దీనిపై విచారణకు ఆదేశించారు. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అటవీ భూమిపై విజిలెన్స్ అధికారులు విచారణ పూర్తి చేసి ప్రాథమిక నివేదిక ఇచ్చారని సమాచారం. అయితే ఇందులో మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు అప్పగించారని నివేదికలో ఇచ్చారని మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై గతంలో కూడా పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఓ సందర్భంలో మీడియాలో మాట్లాడుతూ తాము వద్ద భూమి ఉంటే తీసుకోవచ్చని అన్నారు. ఇటీవల మాట్లాడుతూ తమ పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మూడు ఛానెల్స్ పై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు.
అధికారులే బాధ్యులు
చాల సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న పుంగనూరు రాగానిపల్లి పంచాయతీ 928.48 ఎకరాల భూమికి సంబంధించి 2022 ఫిబ్రవరి 28న అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సెటిల్ మెంట్ అధికారి... ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లుకు సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ఏ పరిశీలన చేసారో ఏమో కాని ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పుకునే కొందరు పేరుపై 2023లో అప్పటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, పుంగనూరు తాహసిల్దార్ సీతారామ్ మార్పు చేసి 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మందికి కేటాయించారు. ఇది ఆన్ లైన్ లో సైతం మారిపోయింది. అప్పట్లో వీటి పనులు చేసిన అధికారులు నేడు కూటమి ప్రభుత్వం లో సైతం కీలక పదవుల్లో పని చేస్తున్నారు. అయితే వీరిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ఆ భూమిని ఏమి చేస్తుంది.. పెద్దిరెడ్డిని ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాలి.