అన్వేషించండి

TTD Tirumala: అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం, 22న స్వర్ణ రథోత్సవం

Andhra Tirumala News: తిరుమలలో అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండవ రోజైన ఈ 22న స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

Tirumala Tirupati Devasthanam- తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం (ఏప్రిల్ 21న) శోభాయ‌మానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే ప‌లుర‌కాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.

వైభవంగా స్నపన తిరుమంజనం (Snapana Tirumanjanam)
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. 

TTD Tirumala: అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం, 22న స్వర్ణ రథోత్సవం
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

సప్తగిరులను తలపించిన వసంతమండపం - 
టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో వ‌సంత‌మండ‌పాన్ని శేషాచల అడవులను త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం 250 కేజిల వట్టి వేరు, 600 కేజిల సాంప్రదాయ పుష్పాలు, 10 వేలు కట్ ఫ్లవర్స్ తో సుందరంగా రూపొందించారు. ప‌చ్చ‌ని చెట్లు, పుష్పాలతోపాటు ప‌లుర‌కాల జంతువుల ఆకృతులను ఏర్పాటుచేశారు. వీటిలో పులి, చిరుత‌, కోతులు, పునుగుపిల్లి, కొండ‌చిలువ‌, కోబ్రా, నెమ‌లి, హంస‌లు, బాతులు, హ‌మ్మింగ్ బ‌ర్డ్‌, మైనా, చిలుక‌లు ఉన్నాయి. ఇవి భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఏప్రిల్ 22న స్వర్ణ రథోత్సవం
వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 22న ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Embed widget