News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

TTD News: తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతోంది. గ్యాలరీలు అన్నీ ఉదయమే నిండిపోవడం గమానర్హం. 

FOLLOW US: 
Share:

TTD News: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవను ద‌ర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భ‌క్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి, అధికారులతో కలిసి నాలుగు మాఢ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన.. టీటీడీ సీనియర్ అధికారులను, శ్రీవారి సేవకులను అభినందించారు. భ‌క్తులకు అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగు దొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

గరుడ వాహన సేవ సందర్భంగా ఉద‌యానిక‌ల్లా గ్యాల‌రీలు భ‌క్తుల‌తో నిండిపోయాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం అయింది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడ వీధుల్లో గ‌ల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవ‌కాశ‌ం ఉంది. భ‌క్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ,  ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగ‌ళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండ‌ల్‌, కాఫీ, పాలు మళ్లీ అందజేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనం ప్రారంభం కానుండ‌గా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారని ఆలయ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు. 

గరుడ వాహన సేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ ఏం చెప్పారంటే?

గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలసి శుక్రవారం సాయంత్రం పరిశీలించినట్టు తెలిపారు. గ్యాలరీలలో వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం చేయించిన తరువాతే స్వామి వారు ఆలయానికి వేంచేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలా మందితో మాట్లాడానని, అందరూ టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.

భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారు జాము నుంచి అంకిత భావంతో, భక్తి శ్రద్ధలతో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ‌ సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు ఆహార పొట్లాల‌ ప్యాకింగ్, గ్యాలరీలలో అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌, ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో తాగునీటి పంపిణీ త‌దిత‌ర సేవలందించారన్నారు.

Published at : 22 Sep 2023 05:33 PM (IST) Tags: TTD News Tirumala Updates TTD EO Dharmareddy salakatla brahmotsavalu TTD Latest News

ఇవి కూడా చూడండి

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Tirumala News: తిరుమలలో వైకుంఠద్వార దర్శన తేదీలు ఇవే, అన్ని ఏర్పాట్లు - ఈవో

Tirumala News: తిరుమలలో వైకుంఠద్వార దర్శన తేదీలు ఇవే, అన్ని ఏర్పాట్లు - ఈవో

Chandra Babu Visits Tirumala: ఏడు కొండల వేంకంటేశ్వరుడిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి

Chandra Babu Visits Tirumala: ఏడు కొండల వేంకంటేశ్వరుడిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్