అన్వేషించండి

Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ

కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల చెన్నై వృద్ధురాలు నవనీతమ్మ వీడియో వైరల్ కావడంతో, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్పందించి ఆమె కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రీవారి భక్తురాలి వైరల్ వీడియోతో చైర్మన్ ప్రత్యేక దర్శనం కల్పించారు.
  • నవనీతమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు.
  • కుటుంబంతో వీఐపీ దర్శనం పొందిన ఆమెకు, ఈవో ఆశీర్వాదం పొందారు.

TTD Chairman BR Naidu | తిరుపతి: ఇటీవల కాలినడకన తిరుమలకు కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లు పైగా వయసున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆ 116 ఏళ్ల వృద్ధురాలికి ఉన్న అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చలించిపోయారు. ఆ వృద్ధ భక్తురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలంటూ ఆయన  సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి విజిలెన్స్ అధికారులు – నవనీతమ్మగా గుర్తింపు
చైర్మన్ విజ్ఞప్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి వివరాల కోసం ప్రయత్నించారు. ఆ వృద్ధురాలిని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి తిరుమల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.


Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ

Also Read: మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం – మురిసిపోయిన కుటుంబ సభ్యులు
టీటీడీ చైర్మన్ నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం వృద్ధురాలైన నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. బయోమెట్రిక్ కౌంటర్ వద్ద సిబ్బంది దగ్గరుండి ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.

ఈఓ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ శతాధిక వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. ‘ఆ శ్రీనివాసుడి రూపంలో టీటీడీ చైర్మన్  మా అమ్మమ్మకు, మా కుటుంబానికి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీకి, చైర్మన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Frequently Asked Questions

ఆ వృద్ధురాలి వీడియో ఎందుకు వైరల్ అయ్యింది?

తిరుమలకు కాలినడకన కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లకు పైబడిన వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆమె అచంచలమైన భక్తికి ఇది నిదర్శనం.

ఆ వృద్ధురాలి పేరు ఏమిటి మరియు ఆమె ఎక్కడ నుండి వచ్చింది?

ఆ వృద్ధురాలి పేరు నవనీతమ్మ. ఆమె తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినవారు.

టీటీడీ చైర్మన్ వృద్ధురాలికి ప్రత్యేక దర్శనం ఎందుకు ఏర్పాటు చేశారు?

వృద్ధురాలి అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా చలించిపోయారు. అందుకే ఆమెకు ప్రత్యేక శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

దర్శనం తర్వాత టీటీడీ అధికారులు ఆమెను ఎలా గౌరవించారు?

టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి, ఆమె కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ ప్రత్యేక దర్శనంపై నవనీతమ్మ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు?

నవనీతమ్మ మనవడు దిక్పతీ భావోద్వేగానికి లోనై, టీటీడీ చైర్మన్ శ్రీనివాసుడి రూపంలో తమకు అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారని ధన్యవాదాలు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget