Parakamani theft case: పరకామణి చోరీ ఘటనపై కొత్తగా క్రిమినల్ కేసు - టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం
TTD board: పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది.

TTD board takes key decisions in Parakamani theft case: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మంగళవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు దొంగిలించిన కేసును లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకుని, ఆ రాజీ భాగంగా 14.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇచ్చిన వ్యవహారం వెనుక ఉన్న లోతైన కుట్రను పూర్తిగా బయటపెట్టేందుకు కొత్త క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది.
900 డాలర్లు దొంగించి పధ్నాలుగున్నర కోట్ల ఆస్తులు రాసిచ్చిన రవికుమార్
పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్ పరకామణి విభాగంలో విదేశీ కానుకలు లెక్కించే బాధ్యతల్లో ఉండేవారు. ఒక వ్యక్తి హుండీలో పడిన విదేశీ కరెన్సీని దొంగిలించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం పట్టుకుని అతనిపై కేసు పెట్టింది. కానీ కేసు విచారణలో ఉండగానే లోక్‌అదాలత్‌లో రాజీకి చేసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 14.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా తీసుకున్నారు. అప్పటి బోర్డు దాన్ని అంగీకరించింది. కానీ “కేవలం 75 వేల రూపాయల దొంగతనం కోసం 14.5 కోట్ల భూమి ఎందుకు ఇచ్చాడు?” అనే ప్రశ్న ప్రస్తుత టీటీడీ బోర్డుకు వచ్చింది.
ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో
ప్రస్తుతం ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలోకి ఉంది. 2025 అక్టోబర్ 7న హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ డీజీపీ పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇదే అంశం మరో రెండు కేసుల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఇంతలో ఈ రాజీకి కారకుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే మంగళవారం టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ విషయం లోతుగా చర్చించారు. పాత కేసు తిరిగి తెరిచినా విచారణ పరిధి చాలా పరిమితం అవుతుందని, అందువల్ల కుట్ర మొత్తం బయటపడదని బోర్డు గుర్తించింది. అందుకే కొత్తగా క్రిమినల్ ఫిర్యాదు చేసి, ఈ రాజీ వెనుక ఉన్న ముసుగులు తొలగించాలని, గతంలో దాచిపెట్టిన ఇతర దొంగతనాలు, దుర్వినియోగాలు కూడా బయటపడేలా చూడాలని నిర్ణయించారు.
పాత దొంగంతనాలన్నీ బయటకు వచ్చేలా మరోసారి క్రిమినల్ కేసు
2023 సెప్టెంబర్ 9న తిరుపతి కోర్టులో జరిగిన లోక్‌అదాలత్ రాజీని “కుట్రపూరితమైనది” అంటూ పూర్తిగా పక్కన పెట్టేందుకు కూడా బోర్డు సిద్ధమైంది. ఈ చర్య వల్ల ఒకే నేరానికి రెండుసార్లు శిక్ష ఆరోపణ రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నామని బోర్డు స్పష్టం చేసింది. స్వామివారి హుండీలో పడిన ప్రతి రూపాయి దేవుడిదే, భక్తుల విశ్వాసం దేవుడి మీద ఉందని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయం పూర్తిగా పరిపాలనాపరంగా, భక్తుల భావాలను, సనాతన ధర్మ పవిత్రతను కాపాడే ఉద్దేశంతోనే తీసుకున్నామని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా పేర్కొన్నారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
ట్రెండింగ్ వార్తలు





















