Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - ఆరోజు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala Latest News: తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపింది.
VIP Break Darshans cancelled : భక్తులకు TTD టీటీడీ అలర్ట్ - ఆరోజు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో జూలై 11న విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు.
జూలై 17 న ఆదివారం అస్థానం సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేయడం జరిగిందని, ఈ కారణంగా జూలై 11న విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..
జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈ మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.
కరోనా తరువాత హుండీకి భారీ ఆదాయం
ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు పైమాటే. గతంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో ఒక్క మే నెలలోనే శ్రీనివాసుడి ఖాతాలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులను పూర్తిస్థాయిలో అనుమతిస్తు్న్నారు. అందువల్ల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు.
2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల