Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ
TTD Special Darshan Tickets Online: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేటి ఉదయం 9 గంటలకు దేవస్థానం విడుదల చేసింది.
Special Darshan Tickets Online: తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేటి ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
జులై 7న సెప్టెంబరు నెలకు సంబంధించి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్ లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..
జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కరోనా వ్యాప్తి అనంతరం దాదాపు రెండేళ్ల తరువాత ఆన్‌లైన్ , ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. గత నెల రోజుల నుంచి తిరుమలలో స్వామి వారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి హుండీకి సైతం కానుకలు భారీగా వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులో శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా, ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందకు దాదాపు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారి హుండీకి రూ. 4.35 కోట్లు ఆదాయం సమకూరింది. సర్వదర్శనానికి 30 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!