News
News
X

తిరుమలలో ప్రతి సోమవారం నిర్వహించే ఆ సేవను రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే !

Tirumala News: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. 

FOLLOW US: 

Chaturdasa Kalasa Visesha Pooja at Tirumala: తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం 12-0 9-2022 రోజున 89,793 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 30,254 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.47 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. 

ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు 
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 

సర్కారు హారతి తరువాత దర్శనభాగ్యం.. 
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో‌ భాగంగా టిటిడి‌ రద్దు చేసింది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు..అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 12 Sep 2022 08:46 AM (IST) Tags: Tirumala TTD Telugu News Tirupati Tirumala News

సంబంధిత కథనాలు

Tirupati Road Accident: బెంజ్ కార్ గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్, Viral Video

Tirupati Road Accident: బెంజ్ కార్ గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్, Viral Video

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala News: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ కలెక్షన్ ఎంతంటే

Tirumala News: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ కలెక్షన్ ఎంతంటే

Anantapur: ‘డబ్బులు తిరిగిరావు అడుక్కుతినండి, ఇంటికొస్తా ముగ్గురం భజన చేద్దాం’ పోలీస్ షాకింగ్ కామెంట్స్!

Anantapur: ‘డబ్బులు తిరిగిరావు అడుక్కుతినండి, ఇంటికొస్తా ముగ్గురం భజన చేద్దాం’ పోలీస్ షాకింగ్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?