అన్వేషించండి

Tirumala News: శ్రీవారికి గురువారం రోజే పూలంగి సేవ ఎందుకు నిర్వహిస్తారు? ప్రత్యేకత ఏంటంటే

Poolangi Seva In Tirumala: స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు.

తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది.. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు.. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.. బుధవారం రోజు 74,748 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.. 39,086 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.45 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది.. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో స్వామి వారి సర్వదర్శనం కోసం బయట టిబిసీ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు.. స్వామి వారి సర్వదర్శనం కోసం దాదాపుగా 18 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.. 

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు.. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు.‌. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు.. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు.. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు.. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుగుతుంది.. దీనికే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు..

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు.. అటుతరువాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించిన తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు.. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది.. అట తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి,తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు.. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు.. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు అర్చకులు.. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది.. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు.. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు.. 

విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన
అనంతరం పరదా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది.. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు.. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు.. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు..దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది.. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.. 

తులసీ దళములతో శ్రీవారికి అర్చన 
శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు.. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు..అటుతరువాత తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు.. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు.. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు.. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది.. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు.. 

వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా
శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు.. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు.. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు.. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.. అటుతరువాత స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను నిర్వహిస్తారు.. అటు తరువాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు.. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు.. 

అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు..అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు.. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు.. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు.. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు.. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Surya Narayana Temple Budagavi : ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Surya Narayana Temple Budagavi : ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
ఉరవకొండలో సూర్య భగవానుడి ఆలయం..శతాబ్ధాల క్రితం కొలువుతీరిన ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసా!
Indian Migrants: భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
Nagasadhu Aghori Arrest: వివాదాస్పద నాగసాధు అఘోరిని అదుపులోకి తీసుకున్న సిరిసిల్ల పోలీసులు
వివాదాస్పద నాగసాధు అఘోరిని అదుపులోకి తీసుకున్న సిరిసిల్ల పోలీసులు
Arasavalli Temple: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
Embed widget