News
News
X

Tirumala Darshan: పొద్దున 7 గం.కు క్యూలోకి వెళ్తే రాత్రి 10 శ్రీవారి దర్శనం, ఈ టోకెన్ ఉంటే 3 గంటల్లోనే

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

FOLLOW US: 
Share:

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం రోజున 61,374 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 19,691 మంది తలనీలాలు సమర్పించగా, 4.20 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లో మాత్రమే వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 14 గంటల సమయం పడుతుంది. మంగళవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనికి ప్రవేశించిన భక్తులకు రాత్రి 10 గంటలకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.  

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.

అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 21 Feb 2023 08:19 AM (IST) Tags: Tirumala Tirupati Tirumala Darshan news Srivari Hundi Income Sri venkateshwara swamy Darshan timings

సంబంధిత కథనాలు

Tirumala Darshan News: శ్రీవారి ఆలయంలో‌ నేడు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 8 గంటలకు

Tirumala Darshan News: శ్రీవారి ఆలయంలో‌ నేడు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 8 గంటలకు

Vandebharat Express: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవీ, మధ్యలో స్టాప్‌లు ఎక్కడెక్కడంటే

Vandebharat Express: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవీ, మధ్యలో స్టాప్‌లు ఎక్కడెక్కడంటే

Tirumala News: శ్రీరామ నవమి నాడు తిరుమల శ్రీవారి పూజలు ఇవీ, సాయంత్రం హనుమంత వాహనంపై

Tirumala News: శ్రీరామ నవమి నాడు తిరుమల శ్రీవారి పూజలు ఇవీ, సాయంత్రం హనుమంత వాహనంపై

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు