అన్వేషించండి

ఏపీ ప్రభుత్వానికి సాయం చేస్తుందని ప్రచారం- షాకింగ్ నిర్ణయం తీసుకున్న టీటీడీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్లు రూపం ఇచ్చే ప్రక్రియ టిటిడికి కొత్తదేం కాదు.

కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడు వైకుంఠాన్ని వదిలి సాలగ్రామ శిలరూపంలో తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువైయున్నారు. శ్రీ‌ వేంకటేశ్వరుడి క్షణకాలం పాటు జరిగే దర్శన భాగ్యం‌ కోసం దేశ విదేశాల నుంచి ప్రతి నిత్యం భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామి వారికి ముడుపుల‌ రూపంలో వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు స్వామి వారిపై భక్తి భావంతో శ్రీవారి హుండీలో సమర్పించే నగదు కార్పస్ ఫండ్ రూపంలో టీటీడీ వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి భద్రపరుస్తుంది. నగదుతోపాటుగా భక్తులు సమర్పించి బంగారాన్ని సైతం‌ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచుతుంది.

బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వివిధ ట్రస్టులకు విరాళాలు అందిస్తూ ఉంటారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా పది వేల రూపాయలు అందించిన భక్తులకు ప్రివిలేజ్ ద్వారా స్వామి వారి దర్శన భాగ్యం‌‌ కల్పిస్తుంది. అయితే శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నగదును పురాతన ఆలయాలు ఆధునీకరణ, నూతన దేవాలయాలు నిర్మాణం చేపట్టి, ధూపదీపన నైవేద్యాలు సమర్పించేందుకు టిటిడి వినియోగిస్తుంది.

శ్రీ వేంకటేశ్వరుడిపై అపారమైన భక్తితో వేల కిలో మీటర్లు సైతం లెక్క చేయకుండా తిరుమలకు చేరుకుని రోజులు, గంటల తరబడి వేచి ఉండి ఆనంద నిలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ దర్శనం పొంది పునీతులు అవుతుంటారు.. అంతే కాకుండా శ్రీనివాసుడికి తమ తమ స్తోమతకు తగ్గట్టుగా భక్తులు హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తుంటారు.. ఇలా ఏడాది కాలంలో టిటిడికి భక్తులు హుండీ ద్వారా రూ. 700 నుంచి రూ.1000 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది.. ఇలా వచ్చిన నగదును కార్పస్ ఫండ్‌గా జాతీయ బ్యాంకుల్లో జమ చేస్తుంది టీటీడీ. నగదుతో పాటుగా బంగారును డిపాజిట్ చేసి భద్ర పరుస్తుంది. 

ప్రతి మూడు నెలలకు ఓసారి జరిగే పాలక మండలి సమావేశంలో డిపాజిట్లపై టిటిడి ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటుంది. కొందరు సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టిటిడి ఆదుకుంటోందని ప్రచారం సైతం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టిటిడి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తోంది. కానీ ఇటీవల ఈ ప్రచారం మరింత ఎక్కువగా మారింది. 

టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి భక్తులు సమర్పించి నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్లు రూపం ఇచ్చే ప్రక్రియ టిటిడికి కొత్తదేం కాదు. 1987వ సంవత్సరంలో సెక్షన్ 111(3) ఎండోమెంట్ యాక్ట్ 30, 1990 గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం టీటీడీ రూల్ నంబర్ 80లో సెక్యూరిటీ డిపాజిట్లు ప్రభుత్వ నియమాలు అనుసారం ప్రభుత్వ అనుమతితో డిపాజిట్ చేయవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నిబంధనలను అనుసరించి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత జరిగిన పాలక మండలి సభ్యులతో డిపాజిట్లపై చర్చించి సాధ్యా సాధ్యాలపై ఓ కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆనాటి నుంచి నేటి వరకు డిపాజిట్ల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నగదు డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే టిటిడి డిపాజిట్ల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంపై శనివారం‌ తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు నేరుగా టిటిడి ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించారు.. భక్తుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన‌ ఈవో టిటిడి డిపాజిట్ల వ్యవహారాన్ని తెలియజేశారు. 

సోషల్ మీడియా వేదికగా టిటిడి డిపాజిట్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఈవో ఏవి.ధర్మారెడ్డి ఖండించారు. టిటిడిని టార్గెట్‌గా చేసుకుని దుష్ప్రచారం చేయడం తగ్గదని హెచ్చరించారు. ఐదు వేల కోట్ల డిపాజిట్లను స్టేట్ గవర్నమెంట్‌కు బాండ్ల రూపంలో ఇచ్చారనేది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. నేషనలైజ్డ్ బ్యాంకులలోనే నగదు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి వందంతులు ఎవరు నమ్మొద్దని భక్తులను టిటిడి ఈవో విజ్ఞప్తి చేశారు. 

వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై శ్వేత పత్రాన్ని టీటీడీ విడుదల చేసింది. వైసీపి అధికారంలోకి రాక ముందు ఉన్న డిపాజిట్లు, అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న డిపాజిట్లు వివరాలు వెల్లడించింది.

బ్యాంకు పేరు 2019 జూన్‌ నాటికి డిపాజిట్స్‌  2022 సెప్టెంబర్‌ నాటికి డిపాజిట్స్‌
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా రూ.10.20 కోట్లు రూ. 5358.11 కోట్లు
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా  రూ.288.19 కోట్లు రూ.1694.25 కోట్లు
బ్యాంక్ అఫ్ బరోడా  రూ.1956.53 కోట్లు రూ.1839.36 కోట్లు 
కెనరా బ్యాంక్ రూ.4913.73 కోట్లు రూ. 1351.00 కోట్లు
యాక్సిస్ బ్యాంక్  రూ.151.59 కోట్లు రూ.1006.20 కోట్లు
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్  రూ.1253.68కోట్లు రూ. 2122.85 కోట్లు
సౌత్ ఇండియన్ బ్యాంక్‌ రూ.1229.29 కోట్లు 0
ఇండస్ ఇండ్ రూ.1218.99 కోట్లు 0
హెచ్డిఎఫ్సి బ్యాంక్  0 రూ. 779.17 కోట్లు
గవర్నమెంట్ అఫ్ ఇండియా బాండ్స్ రూ.555.17 కోట్లు రూ. 555.17 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0 రూ. 660.43 కోట్లు
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రూ.4.87 కోట్లు రూ. 306.31 కోట్లు
ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్  0 రూ. 101.43 కోట్లు
ఇండియన్ బ్యాంక్ రూ.34.46 కోట్లు  రూ. 25.30 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ రూ.80.04 కోట్లు  0
ఐసీఐసీఐ బ్యాంక్  0 రూ. 9.70 కోట్లు
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ.88.31 కోట్లు  రూ. 99.91 కోట్లు
బ్యాంకు అఫ్ ఇండియా  రూ.5.53 కోట్లు 0
యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్  రూ.3.74కోట్లు రూ. 1839.36 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా  0 రూ. 1.28 కోట్లు
కరూర్ వైశ్య బ్యాంక్ 0 రూ. 4.37 కోట్లు
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ. 10.00 కోట్లు  రూ. 4.0 కోట్లు
ఏపీ స్టేట్ కో ఆప్షన్ బ్యాంక్ రూ. 50.77 కోట్లు రూ. 1.30 కోట్లు
మొత్తం  రూ. 13025.09 కోట్లు రూ. 15938.68 కోట్లు

బంగారం డిపాజిట్‌

బ్యాంకు పేరు 2019 జూన్‌ నాటికి డిపాజిట్స్‌  2022 సెప్టెంబర్‌ నాటికి డిపాజిట్స్‌
 స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 53807.56 కేజీలు 9819.38 కేజీలు
ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు 1952.18కేజీలు 438.99 కేజీలు
మొత్తం  7339.74 కేజీలు  10258.37 కేజీలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget