News
News
X

Tirumala Darshan Time: ఖాళీగా ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి దర్శన సమయం ఎంతంటే?

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

FOLLOW US: 
Share:

తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 74,994 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 25,799 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 3.59 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో ఎక్కడ వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనంకు భక్తులను ఆలయం‌కు అనుమతిస్తున్నారు టిటిడి సిబ్బంది. ఉదయం ఏడు గంటలకు తర్వాత వచ్చిన సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు 14 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.  

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో‌ భాగంగా టిటిడి‌ రద్దు చేసింది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 06 Mar 2023 08:15 AM (IST) Tags: Tirumala Tirupati Tirumala Darshan news Srivari Hundi Income Sri venkateshwara swamy Darshan time

సంబంధిత కథనాలు

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

YV Subbareddy: తిరుమలలో 11 కోట్లతో ఫీడ్‌ మిక్సింగ్ కేంద్రం ప్రారంభం- 4 వేల లీటర్ల పాల ఉత్పత్తి దిశగా చర్యలు

YV Subbareddy: తిరుమలలో 11 కోట్లతో ఫీడ్‌ మిక్సింగ్ కేంద్రం ప్రారంభం- 4 వేల లీటర్ల పాల ఉత్పత్తి దిశగా చర్యలు

Tirumala Darshan News: శ్రీవారి ఆలయంలో‌ నేడు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 8 గంటలకు

Tirumala Darshan News: శ్రీవారి ఆలయంలో‌ నేడు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 8 గంటలకు

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి